“సేవాతీర్థ్” “లోక్‌భవన్”గా-పీ.ఎం.ఓ,,రాజ్ భవన్ ల పేర్లు మార్పు
అమరావతి: ప్రధాన మంత్రి కార్యాలయం,, రాజ్‌భవన్ పేర్లను కేంద్ర ప్రభుత్వం మార్చుతు నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయంకు “సేవాతీర్థ్” గా, నామకరణం చేసింది. అలాగే రాజ్‌భవన్ పేరును “లోక్‌భవన్” గా మారుస్తున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యాలయం నవంబర్ 25న ఒక ప్రకటన విడుదల చేసింది..పార్లమెంట్ శీతకాల సమావేశాలు 1వ తేది నుంచి ప్రారంభం అయిన సందర్బంలో మంగళవారం పీఎంఓకు సేవాతీర్థ్ గా నామకరణం చేసినట్లు సంబంధిత పరిపాలనశాఖాధికారులు తెలిపారు.. అదేవిధంగా కేంద్రం నిర్ణయం మేరకు ఇప్పటికే పలు రాష్ట్రాలు తమ రాష్ట్రంలోని రాజ్‌భవన్‌కు లోక్‌భవన్‌గా పేరు మార్చాయి.

