ప్రధాని మోదీని వరించిన “ది గ్రేట్ ఆనర్ ఆఫ్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా” పురస్కరం
అమరావతి: భారత ప్రధాని నరేంద్ర మోదీని ఇథియోపియా దేశ అత్యున్నత పురస్కారం వరించింది. అదిస్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్‌లో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆ దేశ ప్రధాని డాక్టర్ అబి అహ్మద్ అలీ, ‘ది గ్రేట్ ఆనర్ ఆఫ్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’ అవార్డుతో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని సత్కరించారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పందిస్తూ, భారతీయులందరి తరఫునా ఈ అవార్డు స్వీకరిస్తున్నానన్నారు. భారత్-ఇథియోపియా బంధాలను పటిష్ఠం చేసేందుకు సహకరించిన ఎందరో భారతీయులకు వచ్చిన గుర్తింపు ఇది అని అభివర్ణించారు. ఇథియోపియా దేశ ప్రధాని అబీ అహ్మద్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు.

