ఒమన్ దేశ అత్యంత విశిష్ట పౌర పురస్కారం “ఆర్డర్ ఆఫ్ ఒమన్” అందుకున్న ప్రదాని మోదీ
అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశ పర్యటనల్లో సంబంధిత దేశాధినేతలు ప్రధాన మంత్రికి,అత్యున్నత పౌర పురస్కారాలను అందచేశారు..ఇప్పటి వరకు ప్రధాని మోదీ వివిధ దేశాల నుంచి 29 అత్యున్నత పౌర పురస్కారాలను అందుకున్నారు. భారత్-ఒమన్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రదాని మోదీ ఒమన్‌లో పర్యటిస్తున్నారు. భారత్-ఒమన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో చేసిన కృషికి గుర్తింపుగా ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్… మోదీకి “ఆర్డర్ ఆఫ్ ఒమన్” పురస్కారాన్ని ప్రదానం చేశారు. “ఆర్డర్ ఆఫ్ ఒమన్” అనేది ఒమన్, విదేశీయులకు ఇచ్చే అత్యంత విశిష్టమైన పౌర పురస్కారం. ఇటీవల కువైట్ ప్రభుత్వం కూడా ‘ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్-కబీర్’తో ఆయనను గౌరవించింది. బుధవారం ఇథియోపియా తన అత్యున్నత పురస్కారమైన ‘నిషాన్ ఆఫ్ ఇథియోపియా’తో ప్రధాని మోదీని సత్కరించింది.

