సిగరెట్ లైటర్ కోసం ఇద్దరు స్నేహితులు మధ్య జరిగిన గొడవతొ ఒకరు మృతి
అమరావతి: మద్యం మత్తులో సిగరెట్ లైటర్ కోసం ఇద్దరు స్నేహితులు మధ్య జరిగిన గొడవ ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. మరొక వ్యక్తి నాలుక తెగి, తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లా కమ్మసంద్రలో సోమవారం రాత్రి ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు…. కర్ణాటకలోని కమ్మసంద్రలో జరుగుతున్న క్రికెట్ పోటీలకు స్నేహితులైన ప్రశాంత్ (35), రోషన్ హెగ్డే వెళ్లారు. మ్యాచ్ ముగిసిన తరువాత ఇద్దరు మద్యం కొట్టారు. ఈ మధ్య మత్తులో వున్న వీరిద్దరి మధ్య సిగరెట్ లైటర్ విషయంలో చిన్నపాటి గొడవ జరిగింది. ఈ గొడవ కాస్త ముదరడంతో బీర్ బాటిళ్లతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో రోషన్ హెగ్డే నాలుకకు తీవ్రగాయమైంది..హెగ్డేకు తీవ్ర గాయాలు కావడంతో భయపడిపోయిన రోషన్ తన కారులో అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ ప్రశాంత్ అతన్నికారు డోర్ పట్టుకుని అడ్డగించేందుకు ప్రయత్నించాడు. దీంతో ప్రశాంత్‌ను అలాగే కారుతో ఈడ్చుకెళ్లి వేగంగా వెళ్లుతూ చెట్టును ఢీకొట్టాడు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రశాంత్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. ప్రశాంత్ మృతికి కారణమైన రోషన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోషన్ నాలుక తెగిపోవడంతో పాటు తీవ్ర గాయాలు కావడంతో ప్రైవేటు ఆస్పత్రిలో అతనికి చికిత్స అందిస్తున్నారు.

