BUSINESSNATIONALOTHERS

ప్రీమియం పెట్రోల్ ధరలను పెంచిన ఆయిల్ కంపెనీలు

అమరావతి: ఇరాన్-అమెరికా,ఇజ్రాయిల్ యుద్దం నేపధ్యంలో క్రూడ్ అయిల్ ధరలు ($100 per barrel) పెరగడంతో ప్రపంచ దేశాల ఇంధన మార్కెట్‌పై ఈ ప్రభావం పడుతోంది. దింతో ప్రీమియం పెట్రోల్ ధర లీటరుకు రూ.2.35 పెరిగింది. దేశవ్యాప్తంగా వీటి ధరలను పెంచినట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శుక్రవారం ప్రకటించడంతో, తక్షణం పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) “Speed”, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) “Power”, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) “XP95’ పెట్రోల్ ధరలు ఆయా ప్రాంతాలను బట్టి లీటరుకు రూ.2.09 నుంచి రూ.2.35 వరకూ పెరిగాయి.ప్రస్తుతానికి సాధారణ పెట్రోల్,డీజిల్ ధరలు మాత్రం యథాతథంగానే ఉన్నాయి.

ఇండస్ట్రియల్ డీజిల్ ధర 25% పెంపు:- ఇండస్ట్రియల్ డీజిల్ ధరలను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) 25 శాతం పెంచింది. దీంతో లీటర్‌ ధర రూ.22 వంతు పెరిగింది. ప్రస్తుతం ఉన్న రూ.87.57 నుంచి రూ.109.59కి డీజిల్ దర పెరిగింది. ఇండస్ట్రిస్, డీజిల్‌ను విద్యుత్ అంతరాయాల సమయంలో జనరేటర్లపై పనిచేసే ఫ్యాక్టరీలు, ఫాపింగ్ మాల్స్‌‌, జెసిబీలు,బుల్డోజర్లు, భారీ యంత్రాల్లో వాడుతుంటారు. వీటి ధరలు పెరగడం వల్ల కంపెనీల ఖర్చు పెరిగి వినియోగదారునిపై ప్రభావం పడే అవకాశం ఉంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *