దక్షిణాఫ్రికాలో కుప్పకూలిన నూతన అహోబిలం ఆలయం
అమరావతి: దక్షిణాఫ్రికాలో కొత్తగా నిర్మిస్తున్న నూతన అహోబిలం ఆలయం కుప్పకూలింది. డర్బన్ నగరం సమీపంలో క్వాజూలు-నటాల్ ప్రాంతంలో ఈ ఆలయ నిర్మాణం జరుగుతొంది.. ఎథెక్విని (గతంలో డర్బన్) ఉత్తరాన రెడ్‌క్లిఫ్‌లోని నిటారుగా ఉన్న కొండపై ఉన్న న్యూ అహోబిలం టెంపుల్ ఆఫ్ ప్రొటెక్షన్‌ను నిర్మాణలను విస్తరించే పనులు శుక్రవారం కార్మికులు ఆ ప్రదేశంలో చేస్తున్న సమయంలో భవనంలోని ఒక భాగం కూలిపోయిందని అక్కడి అధికారులు వెల్లడించారు..ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు..మృతుల్లో ఇద్దరు కార్మికులు,, దేవాలయానికి వచ్చిన ఓ భక్తుడు ఉన్నట్టు సహాయక బృందాలు తెలిపాయి.. శనివారం ఆలయ ట్రస్టు ఎగ్జిక్యూటివ్ సభ్యుడు,, నిర్మాణ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నవిక్కీ జయరాజ్ పాండే(52) మరణించినట్టు అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి..
ప్రపంచంలోని అతిపెద్ద నరసింహదేవ:- రెండేళ్ల క్రితం దేవాలయం ఏర్పాటు అయిన నాటి నుంచీ పాండే అభివృద్ధి కార్యకలాపాల్లో విస్తృతంగా పాలుపంచుకుంటున్నారు..వాతావరణం అనుకూలించకపోవడం అలాగే టన్నులకొద్దీ శిథిలాలు ఉండటంతో వాటిని తొలగించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని రియాక్షన్ యూనిట్ దక్షిణాఫ్రికా ప్రతినిధి ప్రేమ్ బలరామ్ స్థానిక మీడియాకు తెలిపారు..దింతో సహాయక చర్యలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు..శిథిలాల కింద ఇంకా ఎందరు చిక్కుకున్నారనే విషయంపై స్పష్టత లేదు..క్వాజులు-నాటల్ ప్రావిన్షియల్ కోఆపరేటివ్ గవర్నెన్స్ & ట్రెడిషనల్ అఫైర్స్ మంత్రి తులసిజ్వే బుథెలెజీ శనివారం ఆ ప్రదేశాన్ని సందర్శించి, అవసరమైనంత కాలం సహాయక చర్యలు కొనసాగుతాయని తెలిపారు..ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని వెల్లడించారు..ఈ ఆలయం నిర్మాణంకు భారతదేశం నుంచి తెచ్చిన రాళ్లను ఉపయోగించి ఒక గుహను పోలి ఉండేలా రూపొందిస్తున్నారు.. ప్రపంచంలోని అతిపెద్ద నరసింహదేవ దేవతలలో ఒకరిని ఇక్కడ ఉంచుతారని సమాచారం.

