కొల్ కొత్తలో మ్యాచ్ అడకుండా అభివదం చేసి వెళ్లి పోయిన మెస్పీ
70 అడుగుల మెస్సి విగ్రహాం..
అమరావతి: అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సి భారత పర్యటన వచ్చారు. కోల్‌కతాలో శనివారం ఉదయం ల్యాండ్ అయిన అనంతరం కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో 70 అడుగుల మెస్సి విగ్రహాన్ని వర్చవల్‌గా ఆవిష్కరించాడు. భద్రతా కారణాల రీత్యా అతడు అక్కడికి వెళ్లలేకపోయాడు. మెస్సిని చూసేందుకు కోల్‌కతా సహా పలు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ తరలివచ్చారు. అయితే, అక్కడ అభిమానులకు నిరాశే ఎదురైంది. ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో మెస్సి ఆడాల్సి ఉండగా, అక్కడికి వచ్చిన మెస్సీ ఎలాంటి మ్యాచ్ ఆడలేదు. కేవలం ప్రేక్షకులకు అభివాదం మాత్రమే చేసి వెళ్లిపోయారు. దీంతో మెస్సీ మ్యాచ్ చూద్దామని వచ్చిన ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. నిర్వాహకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, స్టేడియంలోకి వాటర్ బాటిళ్లు, కుర్చీలు విసిరేశారు. ప్లేక్సీలు, కటౌట్‌లను చిందరవందర చేసి,, కొన్నింటింని తగుల పెట్టారు.
ఒక్కో టికెట్ 45 వేలు:- పెట్టి దింతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగి ఫ్యాన్స్ ను అడ్డుకున్నారు. సంఘటనపై అభిమానులు మాట్లాడుతూ మెస్సీని చూసేందుకు పక్క రాష్ట్రం నుంచి వచ్చామని,, ఒక్కో టికెట్‌ను రూ.5 నుంచి 45 వేల పెట్టి కొనుగొలు చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటి కనీసం ఆయన్ను ప్రత్యక్షంగా చూడలేని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు.

