NATIONAL

ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సుపీరియర్‌ కిరోసిన్‌ పంపిణీ-కేంద్ర ప్రభుత్వం

అమరావతి: దేశంలో గ్యాస్‌, పెట్రోల్‌ కొరత వదంతులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్‌ సమస్య తగ్గించేందుకు ప్రత్యామ్నాయ చర్యలకు ఉపక్రమించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సుపీరియర్‌ కిరోసిన్‌ పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పంపిణీ చేయనుంది. సర్వీస్‌ స్టేషన్లలో 2500 లీటర్ల వరకు కిరోసిన్‌ నిల్వకు వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 60 రోజులపాటు లేదా తదుపరి ఉత్తర్వల వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *