పశ్చిమాసియా యుద్దంపై అమెరికా రెండునాల్కల ధోరణి
అమరావతి: అమెరికా-ఇజ్రాయిల్-ఇరాన్ ల మధ్య యుద్దం ప్రారంభంమై దాదాపు 33వ రోజులు అయ్యాయి. పరస్పర దాడులతో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధం ఉన్నారంటూ వార్తలు వస్తుండగా మరో వైపు ఇరాన్ పై అమెరికా దాడుల ఉదృతంగా చేస్తోంది. పశ్చిమాసియాలో సైన్యాం సంఖ్యను పెంచుతొందని ఇరాన్ మండిపడుతుంది..ఈ నేపధ్యంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఇరాన్ అధ్యక్షుడు కాల్పుల విరమణను కోరుకుంటున్నాట్లు పేర్కొంటూ, ‘ట్రూత్ సోషల్’లో ఓ పోస్టు పెట్టారు. అమెరికా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడానికి ముందు ట్రంప్ ఈ పోస్ట్ పెట్టడం గమనార్హం. మరోవైపు హోర్ముజ్ జలసంధి “తెరిచుకొని, స్వేచ్ఛగా” ఉన్నప్పుడు మాత్రమే కాల్పుల విరమణ జరుగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. లేకుంటే ఇరాన్‌ను నామరూపాలు లేకుండా చేస్తామని లేదా తిరిగి రాతియుగంలోకి నెట్టేస్తామని ఆయన పేర్కొన్నారు.
నాటో నుంచి తప్పుకునే అంశాన్ని తమ దేశం పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌పై యుద్ధంలో నాటో దేశాలు తమకు సహకరించడం లేదని ట్రంప్ ఆరోపించారు. ఈ మేరకు నాటో నుంచి అమెరికా వైదొలిగే ఆలోచనలో ఉన్నట్లు బ్రిటన్‌కు చెందిన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక చర్యకు మిత్రదేశాలు మద్దతు ఇవ్వడం లేదని.. వాళ్లు విఫలమైనందు వల్లే ఆ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.
నాటో కూటమిని కాగితపు పులిగా అభివర్ణించారు ట్రంప్. నాటో విశ్వసనీయతపై తనకు ఎప్పటి నుంచో చాలా సందేహాలు ఉన్నాయని వ్యాఖ్యనించారు. ఈ సందర్భంగా బ్రిటన్ యుద్ధనౌకల దుస్థితిపై ట్రంప్ నేరుగా విమర్శలు చేశారు ‘మీకు నావికాదళమే లేదు. మీరు చాలా పాతబడిపోయారు. పైగా మీ వద్ద పనిచేయని విమాన వాహక నౌకలు ఉండేవి’ అని ఎద్దేవా చేశారు. ఇందుకు బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ రక్షణ వ్యయాన్ని పెంచాలా? అని సదరు రిపోర్టర్ ప్రశ్నించగా, తానేమీ సలహా ఇవ్వనని, ఆయనకు నచ్చింది చేసుకోవచ్చన్నారు.

