నగరపాలక సంస్థ ఇంచార్జ్ మేయర్ గా రూప్ కుమార్
నెల్లూరు: నగరపాలక సంస్థ మేయర్ పదవికి పొట్లూరు స్రవంతి ఆదివారం రాజీనామా చేసిన కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపల్ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ నిర్దేశాల మేరకు డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ కు ఇంచార్జ్ మేయర్ గా బాధ్యతలను కేటాయిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి అందజేసిన నివేదిక మేరకు రూప్ కుమార్ యాదవ్ కు మేయర్ బాధ్యతలు కేటాయించామని, శాశ్వత మేయర్ ఎంపిక అయ్యేంతవరకు ఆయన మేయర్ గా బాధ్యతలు కొనసాగిస్తారని ఉత్తర్వులలో ప్రకటించారు.

