ఆర్.టీ.సీలో 7673 ఉద్యోగాలు ప్రత్యక్షగా నియమించేందుకు ప్రతిపాదనలు-సురేష్ రెడ్డి
నెల్లూరు: వెంకటాచలం వద్ద ఉన్న శిక్షణా కాలేజి మరమ్మత్తులు,,గూడూరు బస్టాండ్ ఆధునీకరణకు అవసరమైన చర్యలు చేపట్టిన్నట్లు A.P.S.R.T.C. నెల్లూరు జోన్ బోర్డు డైరెక్టర్ & జోనల్ చైర్మన్ ఎస్.సురేష్ రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక ఆర్.టి.సి. బస్టాండ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ A.P.S.R.T.C లో 44131 మంది ఉద్యోగులు ఉన్నారని, పొరుగు సేవల సిబ్బంది 8329 మంది ఉన్నారని అదేవిధంగా ఆన్ కాల్ డ్రైవర్స్ గా 1500 మంది వెరసి మొత్తం 56,860 మంది వివిధ విబాగాలలో సేవలు అందిస్తున్నారన్నారు.
ప్రమాద భీమా కోటి రూపాయలు:- డ్రైవరు- కండక్టరుకు నైట్ అవుట్ అలేవేస్సు మంజూరు చేయుట ద్వారా ఉద్యోగికి సగటున 2 నుండి 5 వేల వరకు ఆర్ధిక ప్రయోజనం కలిగిందన్నారు. క్రింది స్థాయి ఉద్యోగుల పదోన్నతులలో పనిష్మెంట్ గురించి భారీ ఉపశమనం లభించిందని వెల్లడించారు. తద్వారా 7 వేల మంది పదోన్నతులు పొందారన్నారు. స్టేట్ బ్యాంక్ వారితో చర్చించి ప్రమాద భీమా కోటి రూపాయలు, సహజ మరణంకు రూ.10 లక్షల రూపాయలు అందేలా చర్యలు తీసుకోన్నామన్నారు. కారుణ్య నియామకాలలో వెసులు బాటు కపించి 16 మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. విశ్రాంత ఆర్టీసి ఉదోగులకు జీవితాంతం EHS వైద్య సేవలు ద్వారా ఆరోగ్య బద్రత లభించిందన్నారు. అంత్య క్రియల ఖర్చులు 15 వేలనుండి 25 వేలకు పంచుతూ ఆదేశాలు జారీ చేశామన్నారు.
7673 ఉద్యోగాలు ప్రత్యక్ష:- A.P.S.R.T.Cలో 18 వివిధ క్యాడర్లలో 7673 ఉద్యోగాలు ప్రత్యక్ష నియామకం ద్వారా నియమించేందుకు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయన్నారు.ప్రయాణీకుల సౌకర్యార్ధం 1489 నూతన బస్సులు ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు. గ్రాట్యూటి పరిమితి తొలగించడం జరిగిందన్నారు. వైద్య పరంగా అనర్హత కలిగిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు లేదా అదనపు మానిటరి ప్రయోజనాలు అందించదానికి ఆదేశాలు జారీ చేయబడ్డాయన్నారు. డ్రైవరు-కండక్టర్ ల క్రూ అలేవేన్సు చెల్లించుటకు అనుమతి జారీ చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి A.P.S.R.T.C ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయములో సానుకూలంగా తగు చర్యలు తీసుకోవం జరుగుతున్నదన్నారు.

