ఒక రూపాయి 19 పైసలకు యూనిట్ కాస్టును తగ్గించే విధంగా చర్యలు-మంత్రి గొట్టిపాటి
నెల్లూరు: నెల్లూరుజిల్లాలోని కిసాన్ సెజ్ వద్ద 132 కెవి విద్యుత్ స్టేషన్ ను మంజూరు చేస్తున్నమని,, దానిని త్వరలో ప్రారంభిస్తామని రాష్ట్ర ఇంధన వనరుల శాఖ మాత్యులు గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మంగళవారం కోవూరు నియోజకవర్గం రెడ్డిపాలెం మండలం పoచేడు గ్రామపంచాయతీలో సుమారు 3.30 కోట్ల రూపాయలు వ్యయంతో ఏర్పాటు చేసిన 32 /11 కెవి సబ్ స్టేషన్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో మరో సబ్ స్టేషన్ ను మూడు కోట్ల రూపాయల పై చిలుకు వ్యయంతో ప్రారంభిస్తున్నామని అదేవిధంగా రూ.4 కోట్ల వ్యయంతో DE కార్యాలయాన్ని ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో RDSS ద్వారా అనేక పనులు చేపట్టడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను గాడిలో పెట్టే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రానున్న రోజులలో ఒక రూపాయి 19 పైసలకు యూనిట్ కాస్టును తగ్గించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.
500 A A.Eల పోస్టులు భర్తీ:- రాష్ట్రంలో మూడు డిస్కములు పనిచేస్తున్నాయని ఒకటి తిరుపతి, రెండు విజయవాడ, మూడవది విశాఖపట్నంలో ఉన్నాయన్నారు. అయితే విశాఖలో డిస్క్ మ్ మీద అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని, అది వాస్తవ విరుద్ధమని ఆయన ఖండించారు. విద్యుత్ శాఖలో కూడా A A.Eల కొరత ఉన్నదని, రానున్న రోజుల్లో ముఖ్యమంత్రితో చర్చించి 500 A A.Eల పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందన్నారు.
ఎం.పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు కోవూరు నియోజకవర్గంలో 33 కెవి విద్యుత్ సబ్స్టేషన్లు విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ చేతుల మీద ప్రారంభించుకోవడం పరిణామమని ఆయన తెలిపారు.
కోవూరు ఎమ్మేల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో పది కోట్ల రూపాయల వ్యయంతో రెండు విద్యుత్ సబ్స్టేషన్లకు ప్రారంభోత్సవాలు-డిఇ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరుగిందన్నారు. ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్ పర్సన్ సుప్రజ APSPDCL S.E రాఘవేంద్ర,, స్థానిక నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

