చెడిపోయిన చేపలను అంటకడుతున్న చేపల మార్కెట్ వ్యాపారస్తులు
నగరంలో ఏ వస్తువు కొనుగొలు చేయాలన్న ఒకటి రెండు సార్లు ఆలోచించాల్సి పరిస్థితి ఏర్పాడుతుంది. హోటల్స్ లో చూస్తే, ఐస్ బాక్సుల్లో నిల్వ వుంచిన చికెన్,మటన్ లు…మార్కెట్ లో చూస్తూ చెడిపోయిన చేపలను ఐస్ బాక్సుల్లో పెట్టి కేజీ రూ.200లకు నిలబెట్టి మరి అమ్ముతున్నారు. నగర పాలక సంస్థ అధికారులు తరుచూ ఇలాంటి దాడులు నిర్వహించడమే కాకుండా ఇలాంటి అమ్మకాలకు పాల్పపడుతున్న వారిని కఠినంగా శిక్షిస్తే తప్ప, మోసలు కొంత వరకు అయిన అదుపులోకి రావు….
నెల్లూరు: నగరంలోని మైపాడు రోడ్డు (శెట్టిగుంటరోడ్డు) ప్రాంతంలో వున్న చేపల మార్కెట్ లో చెడిపోయిన చేపలను అమ్ముతున్నారన్న వినియోగదారుల ఫిర్యాదుతో నగరపాలక సంస్థ MHO Dr.డాక్టర్ దినేష్ నేతృత్వంలో బుధవారం శానిటరీ విభాగం సిబ్బంది చెడిపోయిన చేపలను,ఐస్ బాక్సుల్లో నిల్వ ఉన్న చేపలు,రొయ్యలను స్వాధీనం చేసుకుని ఫినాయిల్ ద్వారా డిస్ట్రాయ్ చేశారు. ఈ సందర్భంగా హెల్త్ ఆఫీసర్ మాట్లాడుతూ చెడిపోయిన చేపలను అమ్మటం నేరమని, ఇది మొదటి తప్పిదంగా భావిస్తూన్నమని,మళ్లీ ఇలాంటి పొరపాట్లు జరగకుండా వ్యాపారస్తులు చూసుకోవాలని వ్యాపారులను హెచ్చరించారు. చెడిపోయిన చేపలను ట్రాక్టర్ ద్వారా తరలించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్ షరీఫ్, శానిటరీ ఇన్స్పెక్టర్ పద్మజ, శానిటరీ సెక్రటరీలు పాల్గొన్నారు.

