CRIMEDISTRICTS

జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ-కలెక్టర్,ఎస్పీ

నెల్లూరు: జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, ఎస్‌పీ డా. అజిత అధ్యక్షతన NCORD (National Coordination Committee on Drug Law Enforcement) సమావేశం కలెక్టర్ చాంబర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ, మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధించి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అన్ని శాఖల సమన్వయంతో అమలు చేయాలన్నారు.ఎస్‌పీ అజిత మాట్లాడుతూ, మాదకద్రవ్యాల నియంత్రణలో ప్రధానంగా (Supply Reduction),(Demand Reduction),(Awareness & Rehabilitation) పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. డ్రగ్స్ సరఫరా వ్యవస్థను గుర్తించి, దానిని తుడిచి పేట్టే దిశగా కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల్లో చైతన్యం పెంచుతున్నట్లు అడిషనల్ ఎస్‌పీ,EAGLE ASP ప్రస్తుత చేపడుతున్న చర్యలు, అమలులో ఉన్న కార్యక్రమాలపై వివరాలు తెలిపారు.

ముఖ్య నిర్ణయాలు:- మాదకద్రవ్యాల నియంత్రణకు జిల్లాలోని అన్ని శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం,,మత్తు పదార్థాలను సరాఫరాను కఠినంగా నియంత్రించడం చేయాలి. అలాగే అనుమానాస్పద ప్రాంతాల్లో కోర్డన్ & సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించడం,,జిల్లాలోని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద వాహనాల తనిఖీలు ముమ్మరం చేయడం చేయాలి. ఇదే సమయంలో అడవి ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ అలాగే పోర్టు ప్రాంతాల్లో కంటైనర్ల తనిఖీలు,రోడ్లు, రైల్వేలు, సముద్ర మార్గాల్లో చెకింగ్‌ను తప్పనిసరి చేయాల్సి వుంటుంది. అంతర్ రాష్ట్రాల స్మగ్లింగ్‌పై, ముఖ్యంగా విశాఖపట్నం మార్గాలపై ప్రత్యేక నిఘా,,NDPS చట్టం కింద నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి. డ్రగ్స్ నెట్‌వర్క్‌ ను గుర్తించి పూర్తిగా నిర్మూలించడం,,విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు,,  మీడియా ద్వారా డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని విసృత్తం చేయాలి. అలాగే రెగ్యులర్ చెకింగ్స్ ద్వారా డ్రగ్స్ సరాఫరాలను అరికట్టాలని ప్రణాళికలను రూపొందించారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, DM&HO డాక్టర్ సుజాత SC వెల్ఫేర్, DEO, RIO, ఫారెస్ట్ అధికారులు, అగ్రికల్చర్, కమర్షియల్ ట్యాక్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇంటెలిజెన్స్ అధికారులు, డ్రగ్ ఇన్స్పెక్టర్, KP పోర్ట్ CEO, జిల్లా EAGLE సెల్ అధికారులు-సబ్ డివిజన్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *