దగదర్తి తహసీల్దార్ కృష్ణ నివాసంలో ఏసీబీ సోదాలు-కోట్ల రూపాయల ఆక్రమ ఆస్తులు
నెల్లూరు: డిప్యూటీ తాసిల్దారుగా పనిచేస్తూ కోట్ల రూపాయలు అక్రమ సంపాదనపై ఫిర్యాదులు అందడంతో దగదర్తి తహసీల్దార్ కృష్ణ ఇళ్లలో, బుచ్చిలోని అతని తమ్ముడి నివాసంలో అలాగే అతని మిత్రులు, సన్నిహితుల నివాసల్లో ఏసీబీ ఇంచార్జ్ డీఎస్పీ రామకృష్ణుడు ఆధ్వర్యంలో శుక్రవారం సోదాలు నిర్వహించారు.ఈ సందర్బంలో ఇంచార్జ్ డీఎస్పీ రామకృష్ణుడు మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ తాసిల్దారుగా పనిచేస్తూ కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారన్నారు. ఉదయం నుంచి నెల్లూరు, బుచ్చి, దగదర్తితో పాటు 8 చోట్ల నిర్వహించామన్నారు.
అక్రమంగా సంపాదన?:- బుచ్చితో పాటు నెల్లూరులో జీ ప్లస్ 3 స్కూల్ బిల్డింగ్ , వ్యవసాయ భూములు, బంగారు ఆభరణాలు గుర్తించడం జరిగిందని అలాగే ఇంట్లో 398 గ్రామ్స్ గోల్డ్ , లక్ష నగదు, పలు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. పూర్తి వివారాలు అందవాల్సి వుంది.

