ఉగాది రోజు రాష్ట్రంలో లక్ష మంది లబ్దిదారులకు టిడ్కో ఇళ్లు అందజేస్తాం-మంత్రి నారాయణ
అమరావతి: 2014-19 మధ్యలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టిడ్కో ద్వారా 7 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు తీసుకురాగా….3.8 లక్షల ఇళ్లు నిర్మాణం ప్రారంభమైందని కానీ గత ప్రభుత్వం ఆ సంఖ్యను 2,61,000కు తగ్గించడమే కాకుండా వాటిని కూడా పూర్తి చేయకుండా మధ్యలో నిలిపివేసిందని మునిసిపాల్ శాఖ మంత్రి పొంగూరు.నారాయణ తెలిపారు. గురువారం శాసనసభలో సాధారణ బడ్జెట్ డిమాండ్స్ పై చర్చ సందర్భంగా తన శాఖకు సంబంధించిన వివిధ అంశాలపై మంత్రి వివరణ ఇచ్చారు..మంత్రి మాట్లాడుతూ ఇళ్లు నిర్మాణం ప్రారంభించిన కాంట్రాక్టర్లను ఇబ్బందిపెట్టిందని, పాత కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేదని మంత్రి తెలిపారు…ప్రస్తుతం టిడ్కో ఇళ్లను పూర్తి చేసేందుకు హడ్కో ద్వారా రుణం తీసుకున్నామన్నారు..టిడ్కో ఇళ్లలో 365,430 చదరపు అడుగుల విస్తీర్ణంలో పెండింగ్ లో ఉన్న ఇళ్లను వచ్చే జూన్ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు.వచ్చే ఉగాది నాటికి లక్ష టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్దిదారులకు అందిస్తామని మంత్రి చెప్పారు.

