AP&TG

రాష్ట్రంలో గృహావసరాలకు ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు-మంత్రి నాదెండ్ల మనోహర్

ఐదు రోజుల్లోనే 616 కేసులు నమోదు..

ఓటిపీ ఉంటేనే గ్యాస్ సిలిండర్ డెలివరీ..

అమరావతి: రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన పరిస్థితులు లేవని, పుకార్లను నమ్మి గ్యాస్ బుకింగ్ ల కోసం ఎజెన్సీల వద్ద క్యూలు కట్టవద్దని, రోజు వారి సగటు కంటే ఎక్కువ గ్యాస్ సిలిండర్లను గృహ వినియోగదారులకు అందిస్తున్నామని పౌర సరఫరాలు, ఆహారం-వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంత్రి సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలు సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మి ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ల బుకింగ్ కు ఆతృత పడటంతో సర్వర్లు సైతం మోరాయిస్తున్నాయని వివరించారు. కేంద్రం నిబంధల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు, పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల తర్వాత మరో గ్యాస్ సిలిండర్ బుకింగ్ కు అనుమతి ఉంటుందని ఈ విషయం ప్రతి ఒక్కరూ గమనించాలని మంత్రి మనోహర్ సూచించారు.

3 లక్షల సిలిండర్ల డెలివరీ చేశాము:- సాధారణ రోజుల్లో రోజుకు మన రాష్ట్రంలో 2.81 లక్షల గ్యాస్ సిలిండర్ల బుకింగ్ లు జరుగుతాయని, ఈ ఐదు రోజుల్లో గ్యాస్ కంపెనీలు యావరేజ్ గా 2.92 లక్షల గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేస్తున్నామన్నారు. ఒక్కో రోజు 3 లక్షల సిలిండర్ల డెలివరీ కూడా చేశామని మంత్రి మనోహర్ వివరించారు. గ్యాస్ దొరకదన్న పుకార్లను నమ్మి ఎక్కువ మంది గ్యాస్ ఎజెన్సీల వద్ద క్యూలు కడుతున్నారని దీంతో సమస్య తీవ్రంగా ఉందన్న అపోహ ప్రజల్లో పెరుగుతుందన్నారు. కేంద్రం నిబంధనల ప్రకారం గ్యాస్ బుకింగ్ చేయగానే ఓటీపీ వస్తుందని, నూటికి నూరు శాతం ఓటిపీ ఉంటేనే గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారన్నారు. దీంతో బ్లాక్ మార్కెట్ ను, అధిక ధరలు వసూళ్లు కు పాల్పడకుండ అరికట్టవచ్చన్నారు.

ఐదు రోజుల్లోనే 616 కేసులు నమోదు:- బ్లాక్ మార్కెట్ పై ఉక్కుపాదం మోపాలని, గృహావసరాలకు వినియోగించాల్సిన సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు ఉపయోగిస్తే వారిపై 6ఏ కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ఇప్పటి వరకు అనగా ఈ ఐదు రోజుల్లోనే 616 కేసులు నమోదు చేయడంతో పాటు 2500 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేయడం జరిగిందన్నారు. క్షేత్రస్థాయిలో విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ శాకలను అప్రమత్తం చేసి జేసీల ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి సమాచార లోపం లేకుండా చూస్తున్నామన్నారు. సమావేశంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరవ్ గౌర్, డైరక్టర్ నుపూర్ పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *