AP&TGDISTRICTS

రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ మత్స్యకారుల పక్షమే-మంత్రి కొల్లు.రవీంద్ర

నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ మత్స్యకారుల పక్షమేనని, వారు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం పూర్తిగా వారికి అండగా నిలుస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ గనులుశాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో సముద్రంలో చేపలవేటకు అక్రమబోట్ల ప్రవేశం పూర్తిగా నివారించడం, జువ్వలదిన్నె మత్స్యకారుల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన కమిటీ సభ్యులు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య కలెక్టర్ హిమాన్షు శుక్ల అధ్యక్షతన  ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.

మన తీరంలో చేపలవేటకు అక్రమంగా తమిళనాడు, పాండిచ్చేరి బోట్ల ప్రవేశాన్ని పూర్తిగా అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు, మత్స్యకారుల భద్రత, భరోసా మొదలైన అంశాలపై కమిటీ సభ్యులు ప్రజాప్రతినిధులతో చర్చించారు. సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన పలు అంశాలను ప్రజాప్రతినిధులు కమిటీ సభ్యులు, మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.

పాండిచ్చేరికి చెందిన:- అనంతరం రాష్ట్ర ఎక్సైజ్ గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాత్రికేయులతో మాట్లాడుతూ ఇటీవల జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ లో  8నెలలుగా మత్స్యకారుల ఆధీనంలో వున్న పాండిచ్చేరికి చెందిన నాలుగు బోట్లను గుర్తుతెలియని వారు తీసుకెళ్లారని, దీంతో మత్స్యకారులు ఆవేదనతో వున్నట్లు చెప్పారు.

కొంతమంది కావాలని మత్స్యకారులను రెచ్చగొడుతూ గొడవలు సృష్టించాలని చూస్తున్నారని, తమ ప్రభుత్వానికి మొదటి నుంచి కూడా మత్స్యకారులు అండగా నిలుస్తున్నారని, వారి సంక్షేమం, భద్రతకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో ఏఎస్పీలు దీక్ష, సౌజన్య, మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ శాంతి, ఏడి చాంద్ బాషా, డీఎస్పీలు, మెరైన్ పోలీసులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *