బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం
అమరావతి: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో బుధవారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కృష్ణా, ఎన్టీఆర్,గుంటూరు, బాపట్ల,పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మంగళవారం సా.5 గంటల నాటికి తిరుపతి(జి) మల్లంలో 53.5మిమీ, తడలో 50.7,చిత్తమూరులో 50.2, పూలతోటలో 33.5మిమీ వర్షపాతం నమోదైందని తెలిపింది.

