AP&TGBUSINESSOTHERS

ప్రధాని మోదీ సహకారంతోనే స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు సాధ్యమైంది-సీ.ఎం చంద్రబాబు

ఇంటిగ్రేటెడ్‌ గ్రీన్‌ఫీల్డ్‌ స్టీల్‌ప్లాంట్‌-పవన్ కళ్యాణ్..

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌తోనే..కుమారస్వామి…

విశాఖపట్నం: రూ.1 లక్ష,36 వేల కోట్లతో అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో విశాఖ ఉక్కు కంటే అతిపెద్ద ప్లాంట్‌ రాబోతోందని, ఉత్తరాంధ్రలోని నక్కపల్లిలో సరికొత్త చరిత్ర రాయబోతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆర్సెలార్‌ స్టీల్‌ప్లాంట్‌ పెట్టుబడి ఓ గొప్ప మలుపు కాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ప్లాంట్‌కు భూమి పూజ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి కుమారస్వామి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్,మంత్రి లోకేశ్ తో కలసి ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ సత్తా ఈ స్టీల్‌ప్లాంట్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటు చాటిచెప్పిందన్నారు.ప్రధాని మోదీ సహకారంతోనే ప్లాంట్‌ ఏర్పాటు సాధ్యమైంది. స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటులో మంత్రి లోకేశ్ కృషి ఎంతో ఉందన్నారు. అన్నివిధాలా సహకరిస్తున్న పవన్‌ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్లాంట్‌ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన కేంద్రం సహకారంతోనే సాధ్యమవుతోందని తెలిపారు. ప్లాంట్‌ ఏర్పాటుతో లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతులకు రుణపడి ఉంటామన్నారు. అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతున్నమని, క్వాంటమ్‌ వ్యాలీకి కేరాఫ్‌గా అమరావతి మారబోతోందన్నారు. ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధిలో బాగంగా విశాఖకు గూగుల్‌ డేటా సెంటర్‌ రాబోతోంది అని అన్నారు.

డిప్యూటీ సీఎం పవన్‌:-  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ప్లాంట్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర ప్రజలకు అధిక ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఆర్సెలార్‌ పెట్టుబడులు తమలో విశ్వాసం మరింత పెంచాయని అన్నారు. చంద్రబాబు వంటి దార్శనిక నేత ఉంటేనే పెట్టుబడులు వస్తాయని, చంద్రబాబు వల్లే ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయని అమిత్‌ షా కూడా చెప్పారని పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతికతతో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్‌ గ్రీన్‌ఫీల్డ్‌ స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు కాబోతోందని తెలిపారు.

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌తోనే:- ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తోనే ఏపీ ప్రజలకు మేలు జరుగుతుందని కేంద్ర మంత్రి కుమారస్వామి అన్నారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, ఉక్కు రంగంలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నామని తెలిపారు. విశాఖ ఉక్కును ఆర్థికంగా ఆదుకున్నామని వెల్లడించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *