మీలాంటి నాయకుడు దేశానికి అవసరం పవన్ కళ్యాన్ సార్-కెప్టెన్ దీపిక
అమరావతి: అడిగిన వెంటనే తమ ఊరికి రహదారి మంజూరు చేసిన ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు భారత మహిళా అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం అంధుల క్రికెట్ జట్టు ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ని కలిశారు. ఈ సందర్బంగా దీపిక తమ గ్రామానికి రోడ్డు లేదని మట్టి రోడ్డు కారణంగా తమ గ్రామ వాసులు పలు కష్టాలు ఎదుర్కొంటున్నరని,,రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు.
వెంటనే స్పందించిన పవన్‌కల్యాణ్ రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో సత్యసాయి జిల్లా అధికారులు దీపిక స్వగ్రామమైన మడకశిర నియోజకవర్గంలోని అమరాపురం మండలం హేమవతి పంచాయతీ పరిధిలోని తంబాలహట్టి తండా రోడ్డును పరిశీలించారు. హేమావతి నుంచి తంబలహెట్టి వరకూ రోడ్డు నిర్మాణానికి రూ.3.2 కోట్లు,, గున్నేహళ్లి నుంచి తంబలహెట్టీ వరకూ 5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్లు అవసరమని అధికారులు అంచనాలను కలెక్టర్ కు అందచేయడం,,వెంట వెంటనే శుక్రవారం సాయంత్రానికల్లా పరిపాలనాపరమైన ఆదేశాలు జారీ చేశారు. పవన్‌కల్యాణ్ సత్వర స్పందనపై దీపిక సంతోషం వ్యక్తం అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక ఓ విడియో విడుదల చేశారు.

