ది ఆంధ్ర ప్రదేశ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ ఆక్ట్-2025-అమోదం
కేబినెట్ నిర్ణయాలు..
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం రాష్ట్ర సచివాలయంలో క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలశాఖ మంత్రి పార్ధసారధి మీడియాకు వివరించారు.
- పురపాలక &పట్టణాభివృద్ధి శాఖ:- MA&UD (UBS) Department ద్వారా G.O.Ms.No.246, తేదీ: 28.11.2025 న జారీ చేసిన ఆదేశాలకు (Ratification) రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.ఈ ఆదేశాల ప్రకారం, Apex Committee ఆమోదించిన రాష్ట్ర జల చర్య ప్రణాళిక (State Water Action Plan)కు సంబంధించిన 506 ప్రాజెక్టుల కోసం రూ.9,514.63 కోట్లు వ్యయంతో సవరిస్తూ పరిపాలనా ఆమోదం (Revised Administrative Sanction) మంజూరు చేయబడిందన్నారు. అలాగే, మిగిలిన 281 ప్రాజెక్టులను Lump Sum (LS) విధానంలో, సరైన ప్యాకేజీలుగా విభజించి, కొనుగోలు ప్రక్రియ (Procurement) మరియు అమలు (Execution) మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది.
- పురపాలక &పట్టణాభివృద్ధి శాఖ:- అమరావతిలోని అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ ప్రాంతంలో గవర్నర్ రెసిడెన్స్, అసెంబ్లీ దుర్బార్ హాల్, గవర్నర్ ఆఫీస్, 2 గెస్ట్ హౌస్‌లతో పాటు సిబ్బంది క్వార్టర్లతో కూడిన లోక్ భవన్ నిర్మాణానికి L1 బిడ్‌ను ఆమోదించేందుకు APCRDA కమిషనర్‌కు అధికారం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
- పురపాలక &పట్టణాభివృద్ధి శాఖ:- APలోని NH-16తో అనుసంధానించే ఇంటర్‌చేంజ్‌తో పాటు యుటిలిటీలతో కూడిన బ్రిడ్జులు, అండర్‌పాస్‌లు మరియు 6-లేన్ ఎలివేటెడ్ కారిడార్‌తో E3 రోడ్ (ఫేజ్-III) విస్తరణకు సంబంధించి ప్యాకేజీ XXXXVకు L1 బిడ్‌ను ఆమోదించేందుకు చైర్‌పర్సన్ & MD, ADCL కు అధికారం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు లంప్‌సమ్ కాంట్రాక్ట్ (%టెండర్) కింద రెండు సంవత్సరాల డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్‌తో రూ.532,57,25,425.48/- (+4.05% ECV విలువ కంటే అదనంగా) కాంట్రాక్ట్ విలువతో అమలు చేయబడుతుందని తెలిపారు.
- నీటి వనరుల శాఖ:- చిత్తూరు జిల్లా కుప్పం (M)లో పలార్ నదిపై చెక్-డ్యామ్ మరమ్మతు/పునర్నిర్మాణ పనికి ఇంతకు ముందు G.O.Rt.No.135, WR (MI-R) శాఖ, తే. 21-03-2025లో రూ.1,024.50 లక్షలకు ఆమోదించిన మొత్తానికి బదులు రూ.1596.50 లక్షల సవరించిన పరిపాలనా ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందన్నారు.
- ఆర్థిక శాఖ:- తే.16.03.2025న జారీ చేసిన G.O.Ms.No.28, 30, 29&31, ఫైనాన్స్ శాఖలో DA/DR @ 3.64% చొప్పున తే.1.1.2023&01.07.2023 నుండి ప్రభుత్వ ఉద్యోగులు,ప్రభుత్వ పింఛనుదారులకు మంజూరు చేసిన ఉత్తర్వులను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందన్నారు.
- గిరిజన సంక్షేమ శాఖ:- గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న తెలుగు పండితులు– 227 మంది, హిందీ పండితులు– 91 మంది, శారీరక విద్యా ఉపాధ్యాయులు(PET)– 99 మందిని, స్కూల్ అసిస్టెంట్ల (School Assistants) గా అప్గ్రేడ్ చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందన్నారు.

