మున్సిపల్ ఎన్నికలకు విడుదలైన షెడ్యూల్
తెలంగాణ: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి.13న ఫలితాల వెల్లడిస్తారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలకు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 2 వేల 996 మున్సిపల్ వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.
బుధవారం నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు ఈ జనవరి 30. జనవరి 31వ తేదీన స్క్రూటీని,, నామినేషన్ల ఉపసంహరణ గడువు ఫిబ్రవరి 3వ తేది. మొత్తం ఓటర్ల సంఖ్య 52 లక్షల 43 వేలు. ఇందులో పురుష ఓటర్ల సంఖ్య 25 లక్షల 62వేలు కాగా మహిళా ఓటర్ల సంఖ్య 26 లక్షల 80 వేలు. ఇతర ఓటర్ల సంఖ్య 640.
జనవరి 28వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు తీసుకుంటారు. ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఫిబ్రవరి 13న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభిస్తారు. ఓట్ల లెక్కింపు పూర్తైన వెంటనే ఫలితాలు వెల్లడిస్తారు.

