ఇతర మతాలను ఆదరించడం,సనాతన ధర్మం నేర్పించింది-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
“అభినవ కృష్ణదేవరాయ” బిరుదుతో..
అమరావతి: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ‘అభినవ కృష్ణ దేవరాయ’ అనే బిరుదుని పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం మఠాధిపతి శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ రాష్ట్ర ప్రదానం చేశారు. పవన్ కళ్యాణ్ ఆదివారం, కర్ణాటకలోని పవిత్ర పుణ్యక్షేత్రం ఉడుపిలో పర్యటించారు.ఉడుపి శ్రీకృష్ణ దేవాలయం దర్శించుకున్నారు.పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం మఠాధిపతి శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ ఆహ్వానం మేరకు ‘బృహత్ గీతోత్సవ’లో పాల్గొని ప్రసంగించారు. భగవద్గీతలోని అంశాలను ప్రత్యేకంగా స్మరించుకునేందుకు, నేటి తరానికి భగవద్గీత గొప్పతనాన్ని వివరించేందుకు ఉడుపిలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.ఇటీవల గౌరవ ప్రధాని మోదీ ఉడుపిలో పర్యటించి బృహత్ గీతోత్సవలో పాల్గొన్నారు. లక్షలాది మంది పాల్గొనే ఆదివారం నాటి కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా పాల్గొని, ప్రసంగించారు.
భగవద్గీత,ప్రాంతాలు,మతాలకు ఉద్దేశించింది కాదు:- మనం మన ధర్మాన్ని పరిరక్షించుకోవాలి తమిళనాడులో మన ధర్మాన్ని మనం అనుసరించడం కోసం న్యాయ పోరాటాలు చేయాల్సి వచ్చింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రతీ హిందువులో చైతన్యం రావాలి సనాతన ధర్మం మూఢనమ్మకం కాదు ఆధ్యాత్మిక శాస్త్రం. భగవద్గీత ప్రాంతాలకో, మతాలకో ఉద్దేశించిన గ్రంథం కాదు భగవద్గీత… మనో ధైర్యమిచ్చే గురువు, నిర్దేశించే దిక్సూచి అన్నారు.
