ఒకటవ తేదినే పెన్షన్లు ముందు, ఉద్యోగుల జీతాలు చెల్లించాలి-ఏపిజేఏసి
బిల్లుల ప్రాధాన్యతా క్రమంలో చెల్లించాలి…
అమరావతి: లక్షలాది మంది పెన్షర్లు, ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం ఇంత త్వరగా చొరవ చూపడం అభినందనీయమని ఏపిజేఏసి అమరావతి స్టేట్ చైర్మెన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.శుక్రవారం పెన్షనరీ బెనిఫిట్స్-జి.పి.యఫ్ చెల్లింపులు కోసం ప్రభుత్వం నిధి పోర్టల్ ద్వారా ఒక ప్రత్యేక యాప్ తయారు చేసి, కేంద్ర ప్రభుత్వ అకౌంటెంట్ జనరల్ తో కలిసి పెన్షనరీ బెనిఫిట్స్ అన్ని ఒకే అప్లికేషన్ ద్వారా (ఆన్లైన్ సేవలు) అందించాలని, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ సెల్ ఫోన్ ద్వారా డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించాలన్నారు.జి.పి.యఫ్ లోన్లు, పార్ట్ లేదా పూర్తి స్థాయిలో విత్డ్రాల్ చేసుకోవడానికి ఆన్లైన్లోనే వెసులు బాటు కల్పించేలా యాప్ సిద్ధం చేసేందుకు నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్-ఏపీ జేఏసీ అమరావతి పక్షాన ధన్యవాదాలు తెలిపారు.సచివాలయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులతో (పైనాన్సు విభాగం అధికారుల) రాష్ట్ర సచివాలయంలోనీ రెండవ బ్లాక్ లో ఆర్థిక శాఖ సమావేశపు మందిరంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్యులతో సమావేశం జరిగింది. పెన్షన్-జి.పి.యఫ్ చెల్లింపుల ప్రస్తుతం నిభందనలలో సడలింపులు చేసి నిధి యాఫ్ ద్వారా రిటైర్ మెంట్ బెనిఫిట్సు-జి.పి.యఫ్ చెల్లింపులు సులభతరం చేయడం కోసం ఉద్యోగసంఘాల సూచనలు, సలహాలు తీసుకొనేందుకు పైనాన్సు సెక్రటరీ వాడరేవు వినయ్ చంద్ IAS,, ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ అల్లాడి గౌతమ్ IAS ఆధ్వర్యంలో జరిగింది.
ఉద్యోగులు ఆందోళన చెందుతున్నందున:- ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇప్పటికే ఒకటవ తేదీ జీతాలు, పెన్షన్లు చెల్లిస్తున్నారని, ఈ నెల కొంత ఆలస్యం అవడం వలన ఉద్యోగులు, పెన్షనర్లు ఇబ్బంది పడ్డారని, రాబోయే నెలల్లో ఎట్టిపరిస్థితుల్లో ఒకటవ తేదినే పెన్షన్లు ముందు, ఉద్యోగుల జీతాలు చెల్లించేలా గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.అదేవిధంగా, ఉద్యోగుల జీతాలు చెల్లింపులకు ప్రభుత్వం ఇటీవల కొన్ని బ్యాంకులతో మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్( MOU ) కుదుర్చుకున్నదని, కానీ ఉద్యోగ సంఘాలకు ఆ విషయం తెలియనందున చాలా మంది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నందున, తక్షణమే ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి ఆయా బ్యాంకులతో వచ్చే బెనిఫిట్స్ తెలియజేయాలని కోరారు. దానితోపాటు, పెండింగ్ బిల్లుల చెల్లింపుల్లో ప్రభుత్వం చనిపోయిన, రిటైరైన, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల ప్రాధాన్యతా క్రమంలో చెల్లిస్తే, వారి వారి కుటుంబాలు ఇబ్బంది పడకుండా ఉంటాయని కోరారు. అలాగే ఈ నిధి యాఫ్ లో ఉద్యోగులకు ఏఏ భకాయిలు ఎంత చెల్లించాలో చూపిస్తే బాగుంటుందని చూచించారు. సమావేశంలో ఏపిజేఏసి అమరావతి రాష్ట్ర నాయకులు పలిశెట్టి దామోదరరావు, టి.వి.ఫణిపేర్యాజు, యస్.శ్రీనివాసరావు, యస్.మల్లేశ్వరరావు, జి.వి.నరసయ్య, రవి ప్రసాధ్ తదితరులు పాల్గొన్నారు.

