గణతంత్ర రాజ్యంగా భారతదేశం అవతరించిన శుభ దినోత్సవం-గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపట్టిందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాక గవర్నర్ ప్రసంగించారు. సోమవారం 77వ భారత గణతంత్ర దినోత్సవం వేడుకలు అమరావతిలోని నేలపాడు పరేడ్ గ్రౌండ్లో తొలిసారిగా జరిగాయి.
రైతుల కోసం ప్రత్యేక:- పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్ అంశాన్ని ప్రస్తవిస్తూ “ఇతర రాష్ట్రాలకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్మిస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ సహా అన్ని ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని, రైతుల కోసం ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్:- అమరావతి రాజధాని అభివృద్ధికి పాటుపడుతూనే విశాఖను ఎకనామిక్ జోన్‌గా ఏర్పాటు చేస్తున్నామని గవర్నర్ అన్నారు. “మొదటి సారి విద్యుత్తు శాఖలో ట్రూ డౌన్ చార్జెస్ అమలు చేసి వినియోగదారులపై ప్రభుత్వం భారాన్ని తగ్గించిందన్నారు.ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై ఫోకస్ చేస్తున్నామని వెల్లడించారు.
క్వాంటం వ్యాలీని త్వరలో:- ఎంఎస్ఎంఈల ప్రోత్సాహంతో పాటు ప్లగ్ అండ్ ప్లే విధానంలో ముందుకు వెళ్తున్నామన్న గవర్నర్,, ఏపీ టూరిజం పాలసీ అమలు చేసి పర్యాటక రంగ అభివృద్ధిపై దృష్టి పెట్టడడంతో పాటు స్వచ్ఛాంధ్ర, సేఫ్ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అమరావతి క్వాంటం వ్యాలీని త్వరలో ప్రారంభించనున్నమని,,ప్రతి సవాల్‌ను ఎదుర్కొంటూ.2047 స్వర్ణాంధ్ర విజన్ దిశగా ముందుకు వెళ్తున్నమన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు,ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,,ఐటీ మంత్రి లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

