వంట గ్యాస్ రీఫిల్ బుకింగ్ గడువు పట్టణల్లో 25,గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు-కేంద్రం

అమరావతి: పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల కారణంగా దేశంలో చమురు, గ్యాస్ కొరత వుందంటూ సమాజంలో కొన్ని పైశాచిక శక్తులు తప్పుడ వార్తలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం,అలాంటి వార్తల్లో నిజాలు ఎంతో నిర్దారించుకోకుండా కొంత మంది ఫార్వర్డ్ చేయడంతో,ప్రజల్లో అదుర్ధ మొదలు అవుతొంది. నిజానికి దేశంలో పెట్రోల్,డిజీల్ , గ్యాస్ కు సంబంధించి ఎలాంటి కొరత లేదని కేంద్ర పెట్రోలియం-సహజ వాయువు మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. వంట గ్యాస్ రీఫిల్ బుకింగ్ గడువును చమురు కంపెనీలు 35 రోజులకు పెంచినట్టు మంగళవారం వార్తలు హల్‌చల్ చేస్తూండడంపై స్పందిస్తూ, ఎల్పీజీ బుకింగ్ సమయాల్లో ఎలాంటి మార్పులూ లేవని వివరణ ఇచ్చింది.“గ్యాస్ రీఫిల్ బుకింగ్ గడువు పెంపుపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదు”. గ్యాస్ బుకింగ్ సమయాల్లో ఎలాంటి మార్పులూ లేవు. కనెక్షన్‌తో సంబంధం లేకుండా “పట్టణ ప్రాంతాల్లో రీఫిల్ బుకింగ్‌కు 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల గడువు” ఎప్పటిలాగానే కొనసాగుతుందని కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.

