87వ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోస్టర్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
అమరావతి: యోనెక్స్–సన్‌రైజ్ 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్–2025 పోస్టర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ నెల 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు విజయవాడలో జరిగే ఈ ఛాంపియన్షిప్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రిని రాష్ట్ర క్రీడాశాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాప్ ఛైర్మన్ రవి నాయుడు ఆహ్వానించారు. ఈ సందర్భంగా పోస్టర్ సీఎం పోస్టర్ ఆవిష్కరించారు. ఈ టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించేందుకు క్రీడా శాఖ, మున్సిపాలిటీ, శాప్ విభాగాలు ఏర్పాట్లు చేస్తున్నాయని సీఎంకు వివరించారు. ఏపీలో పదేళ్ల తర్వాత మళ్లీ ఈ ఛాంపియన్ ఫిప్ నిర్వహిస్తున్నామని తెలిపారు. బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌కు సంబంధించిన పాల్గొనే జాతీయ స్థాయి క్రీడాకారుల వివరాలు, నిర్వహణకు చేపట్టిన చర్యలను సీఎంకు తెలిపారు. ఈ టోర్నమెంటను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సీఎం సూచించారు. సీఎంను కలిసిన వారిలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ అంకమ్మ చౌదరి ఉన్నారు.

