AP&TG

నాయుడుపేటలో ఈ నెల 17న టిడ్కో ఇళ్లను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి-కలెక్టర్ వెంకటేశ్వర్

తిరుపతి: ఈ నెల 17వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి జిల్లా నాయుడుపేట నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు కలిసి ముఖ్యమంత్రి పర్యటించనున్న ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 17న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపేటలో నిర్మించిన టిడ్కో ఇళ్లను ప్రారంభించేందుకు రానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *