AP&TG

నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అంటూ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదం

5 కోట్ల ఆంధ్రుల కలల…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధతకు అనుగుణంగా విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతూ సీఎం చంద్రబాబు శనివారం అసెంబ్లీలో ఉధయం తీర్మానం ప్రవేశపెట్టారు. విభజన చట్టంలోని సెక్షన్‌ 5లోని సబ్‌సెక్షన్‌ 2లో ‘ఎట్‌ అమరావతి (అమరావతిలో)’ అన్న పదాన్ని చేర్చాలని తీర్మానించారు. సెక్షన్‌ 5కి సంబంధించి విభజన చట్టంలో ఇచ్చిన వివరణలో ‘AP CRDA ACT-2014 ప్రకారం నోటిఫై చేసిన కేపిటల్‌ సిటీ ప్రాంతాలతో సహా అమరావతి’ అని చేర్చాలని ముఖ్యమంత్రి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై పలువురు సభ్యులు మాట్లాడారు. రాజధాని అమరావతిపై చరిత్రాత్మక తీర్మానికి అసెంబ్లీ అమోదించింది. 5 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతే అంటూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్‌ సమ్మతి తర్వాత ఈ తీర్మానం పార్లమెంట్‌ ముందుకు వెళుతుంది. అక్కడ ఆమోదం పొందాక ప్రభుత్వ రికార్డుల్లోకి చేరుతుంది. నవ్యాంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి చిరస్థాయిగా నిలిచిపోతుంది.

ఉపముఖ్యమంత్రి పవణ్ కళ్యాణ్: ఏపీకి ఒక్కటే రాజధాని, అదీ అమరావతి ఉండాలని జనసేన పార్టీ నుంచి బలమైన నిర్ణయం తీసుకున్నమని, అమరావతి ఇక శాశ్వత రాజధానిగా ఉంటుందని చట్టసభ నుంచి అంతా కలిసి ప్రజలకు వాగ్దానం చేస్తున్నమని ఉపముఖ్యమంత్రి పవణ్ కళ్యాణ్ స్పష్టం చేశారు.ఎవరికైనా వేర్వేరు అంశాల్లో అభిప్రాయబేధాలు ఉండొచ్చు కానీ అమరావతి రైతుల కోసం కట్టుబడి ఉండాలని కోరుతున్నాం, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణమైన ఏపీ మాత్రం ఇంకా రాజధాని కోసం కొట్టుమిట్టాడుతోందని అవేదన వ్యక్తం చేశారు.

తీర్మానం ఆమోదం అనంతరం శాసనసభను స్పీకర్​ అయ్యన్నపాత్రుడు నిరవధికంగా వాయిదా వేశారు. సభ వాయిదా పడగానే చారిత్రాత్మక తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభ కేంద్రానికి పంపించింది. తీర్మానాన్ని కేంద్ర హోంమంత్రి, లోక్​సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్​లకు శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెంటనే పంపించారు. తీర్మానం ప్రతులను హోం శాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అసెంబ్లీ సెక్రెటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్ పంపించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *