AP&TGEDU&JOBSOTHERS

అదనపు ఫీజు వసూలు చేస్తున్న31 ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు చర్యలు తీసుకోవాలి-PAAP

G.O.Ms.No.18 నిబంధన 8(c)ని ఉల్లంఘిన..

అమరావతి: రాష్ట్రంలోని 31 ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ ఇంజనీరింగ్ కళాశాలలు (G.O.Ms.No.118 Annexure-Iలో లిస్ట్ చేసినవి) ప్రభుత్వం జారీ చేసిన G.O.Ms.No.118, Higher Education (R.M) Department, తేదీ: 24.12.2025 లోని నిబంధన 8(c)ని స్పష్టంగా ఉల్లంఘిస్తూ, 2023-24, 2024-25,-26 బ్యాచ్ అదనపు ఫీజులు చెల్లించాలని సర్క్యులర్లు జారీ చేయడంతో పాటు విద్యార్థుల నుంచి అదనపు ఫీజు లు వసూలు చేస్తున్నాయని పేరేంట్ అసోసియేషన్ ​ గౌరవాధ్యక్షులు మలిరెడ్డి కోటారెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు నరహరి శిఖరం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ.ఈశ్వరయ్యలు ఒక ప్రకటనలో ఆరోపించారు. కాలేజ్ యాజమాన్యలు అనుసరిస్తున్న విధానం వేలాది విద్యార్థుల తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతోంది మరియు విద్యార్థుల చదువును ప్రమాదంలో పడేస్తోందని,కోర్టు ఉత్తర్వులకు విరుద్ధం అని తెలిపారు. రాష్ట్రంలోని 31 కళాశాలలు హైకోర్టు తీర్పు, ప్రభుత్వ జీఓను ఉల్లంఘించి అక్రమ సర్క్యులర్లు జారీ చేస్తున్నాయని వెల్లడించారు. ఈ విధానం ప్రభుత్వ ఉత్తర్వులు అతిక్రమించడమే కాకుండా, విద్యార్థులను తలిదండ్రులను ఆర్దిక ఇబ్బందులు గురి చేయడమే అని మండిపడ్డారు.

31 కళాశాలలు జారీ చేసిన అక్రమ ఫీజు పెంపు సర్క్యులర్లను వెంటనే రద్దు చేసి, చట్టవిరుద్ధమని ప్రకటించాలని PAAP డిమాండ్ చేసింది.అలాగే నిబంధనలు ఉల్లంఘించిన కళాశాలల యాజమాన్యంపై తగిన కఠిన చర్యలు (జరిమానా, అనుమతి రద్దు) తీసుకోవాలని కోరారు. పాత అడ్మిషన్ ఆర్డర్ ప్రకారమే ఫీజు వసూలు చేసేలా తక్షణ ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే అదనపు ఫీజు వసూలు చేసిన విద్యార్థులకు పూర్తి మొత్తం రీఫండ్ చేయాలని,, రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఉల్లంఘనల పై  తక్షణమే APHERMC అన్ని కళాశాలలకు స్పష్టమైన సర్క్యులర్ జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు  పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *