ఢిల్లీ హైకోర్టు మాజీ జస్టిస్ యశ్వంత్ వర్మ ఎట్టకేలకు రాజీనామా
అమరావతి: ఢిల్లీ హైకోర్టు జస్టిస్ యశ్వంత్ వర్మ ఎట్టకేలకు రాజీనామా చేశారు. ప్రస్తుతం అయన అలహాబాద్ హైకోర్టుకు ఎటువంటి విధులను కేటాయించకుండా బదలీ చేయడంతో ఆయన పేరుకే జడ్జీగా ఉన్నారు. గత ఏడాది ఢిల్లీలోని ఆయన నివాసంలోని ఒక రూమ్ లో అగ్నిప్రమాదం సంభవించడం,అందులో భారీ ఎత్తున రూ.500 నోట్ల కట్లను రికవరీ చేసిన విషయం విదితమే.2025 మార్చి 14వ తేదీన ఆయన ఇంట్లో భారీగా నగదును సీజ్ చేశారు. ఆయన ఉంటున్న క్వార్టర్స్ లోని స్టోర్‌రూమ్‌లో సగం కాలిన నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో జస్టిస్ వర్మ భూపాల్‌లో ఉన్నారు. స్టోర్‌రూమ్‌లో నగదును తాము పెట్టలేదని వర్మ వాదించారు. ఈ సంఘటనపై సుప్రీం కోర్టు త్రిసభ్య కమిటీని నియామించింది. అవినీతి ఆరోపణ కేసులో ఆయనపై అభిశంసన ప్రక్రియ జరుగుతొంది. ఈ నేపథ్యంలో జస్టిస్ యశ్వంత్ వర్మ అకస్మాత్తుగా రాజీనామా చేశారు. ఏప్రిల్ 9న (గురువారం) తేదీన ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ముర్ముకు పంపారు. రాష్ట్రపతికి రాసిన రాజీనామా లేఖలో ఆయన ఎటువంటి కారణాన్ని వెల్లడించలేదు. తాను తక్షణమే అలహాబాద్ కోర్టు నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. యశ్వంత్ వర్మ రాజీనామా చేయడం వల్ల.. ఆయనపై చేపట్టాల్సిన అభిశంసన ప్రక్రియ నిలిచిపోతుందని లోక్‌సభ సెక్రటేరియట్ లోని ఓ అధికారి వెల్లడించినట్లు తెలిసింది. రాజీనామా తర్వాత జస్టిస్ వర్మకు యధావిధిగా పెన్షన్‌తో పాటు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందుతాయి. ఒకవేళ ఆయన్ను పార్లమెంట్ తొలగిస్తే, అప్పుడు ఆయనకు బెనిఫిట్స్ దక్కవు.

