AP&TGNATIONAL

ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతిగా లోక్‌సభ ఏకగ్రీవ ఆమోదం

అమరావతి: ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ బుధవారం ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఇందులో వైసీపీ మినహా మిగిలిన పార్టీలు బిల్లుకు మద్దతు ప్రకటించాయి. అమరావతి బిల్లుపై జరిగిన చర్చలో 11 పార్టీలకు చెందిన 18 మంది ఎంపీలు పాల్గొన్నారు. అమరావతి బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానుంది. బుధవారం ఉదయం అమరావతి చట్టబద్ధత బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ సభలో ప్రవేశపెట్టారు. అనంతరం జరిగిన చర్చలో ఎంపీలు పాల్గొన్నారు. చర్చ తరువాత అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినట్లు స్పీకర్ ప్రకటించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *