AGRICULTUREAP&TGOTHERS

22 శాతం తేమ ఉన్నా ధాన్యం తీసుకునేలా ఆదేశాలిస్తాం-మంత్రి మనోహర్

నెల్లూరు: రైతుల నుంచి ప్రతి గింజ కొనుగోలు చేయాలి అనే ఉన్నతమైన లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, వైసిపి ప్రభుత్వ హయాంలో నెల్లూరుజిల్లా నుంచి ఒక్క ధాన్యం గింజ కొనుగోలు చేయలేదని, అసలు ధాన్యం సేకరణ చేయకుండా రైతులను నిలువునా ముంచారని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. సోమవారం నెల్లూరుజిల్లా, కొవూరు నియోజకవర్గం ఇనమడుగులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్నిమంత్రి నాదెండ్ల మనోహర్, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో కలిసి సందర్శించారు.

నెల్లూరుజిల్లా వరిసాగు చాలా:- అక్కడున్న రైతులతో మాట్లాడారు. ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. తేమశాతం కొలతను స్వయంగా పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ నెల్లూరుజిల్లా వరిసాగు చాలా ప్రత్యేకమైనది. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే 40 నుంచి 60 రోజులు ఆలస్యంగా సాగు దిగుబడి వచ్చే ప్రాంతం అన్నారు. ధాన్యం కొనుగోలులో గత ప్రభుత్వ నాయకులు గోల్ మాల్ చేసి రూ.82 కోట్ల మేర అవినీతి చేశారని, వైసిపి నాయకులు రోలెక్సు వాచీలతో తిరిగితే, అన్నం పెట్టే సగటు రైతు ఆవేదన వినే నాధుడు లేక వేదన పడ్డారన్నారు.  

నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయంలో మెల్లగా వ్యవస్థలను క్రమబద్ధీకరణ చేస్తున్నాం. గత ఏడాది 75 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే, ఈ ఏడాది 2 నుంచి 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నామని, ఇప్పటికే 60 వేల మెట్రిక్ టన్నులు సేకరించడం జరిగిందన్నారు.

8 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు:- రైతులంతా ప్రభుత్వానికి మాత్రమే ధ్యానం అమ్మాలని, చివరి ధాన్యం గింజ కొనుగోలు చేయడం జరుగుతుందని, ధాన్యం అమ్మిన ఎనిమిది గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు వేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. క్షేత్రస్థాయిలోనూ రైతులు డబ్బులు వేగంగా పడుతున్నాయని చెప్పడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేకంగా కల్లాలు ఏర్పాటు చేస్తాం.ఉప ముఖ్యమంత్రిపవన్ కళ్యాణ్ చొరవతో ఉపాధి హామీ నిధులతో ప్రతి నియోజకవర్గంలో కల్లాలు ఏర్పాటు చేసే చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు తేమ సమస్య అనేది ఉంది.22 శాతం తేమ ఉన్నా ధాన్యం తీసుకునేలా ఆదేశాలిస్తాం. దీంతోపాటు ఆధునిక డ్రోన్లు ఇచ్చిన తరహాలోనే డ్రయర్లు కూడా రైతులకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. రైతులు ఏ రైస్ మిల్ కు ధాన్యం ఇవ్వాలి అనేది వారి సొంత నిర్ణయం. పూర్తిగా వారు ఇష్టప్రకారమే రైస్ మిల్లును ఎంచుకోవాలి. దీనిపై అధికారులు కూడా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కూటమి ప్రభుత్వం వ్యవస్థలో మార్పు కోసం కష్టపడుతోందని, లోపాలను కచ్చితంగా అధిగమిస్తాం అని భరోసా వ్యక్తం చేశారు. వ్యవస్థను రైతులకు అనుగుణంగా, స్నేహపూర్వకంగా తయారు చేసే బాధ్యతను తీసుకుంటాం అని మంత్రి మనోహర్ తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *