పార్లమెంట్‌లో 9వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
అమరావతి: 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు.. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఆదివారం కేంద్ర బడ్జెట్‌ను ప్రకటించడం ఇదే. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రత్యేకంగా కాంజీవరం పట్టు చీరను ధరించి వచ్చిన నిర్మలా సీతారామన్ 9వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ మొత్తం-రూ.53.47 లక్షల కోట్లు…రెవెన్యూ లోటు-రూ.5,92,344 కోట్లు…ద్రవ్యలోటు-రూ.16,95,768 కోట్లు కాగా మౌలిక వసతుల కోసం రూ.12.2 లక్షల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ,, పవిత్ర మాఘపౌర్ణిమ రోజున బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ప్రపంచ మార్కెట్లతో భారత్‌ను అనుసంధానిస్తున్నామని,,దింతో దేశ ఆర్థిక ప్రయాణం స్థిరంగా సాగుతోందని చెప్పారు. యువశక్తి కేంద్రంగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నామన్నారు.దేశ ప్రజల ఆకాంక్షలను ఆచరణలోకి తీసుకొస్తున్నామని తెలిపారు. రైతులు, దళిత, గిరిజన సమూహాలకు అభివృద్ధి ఫలాలు చేరాలని ఆకాంక్షించారు. నైపుణ్యం, పోటీతత్వం, ఉత్పాదకతతో భారత్‌ను ప్రపంచస్థాయికి తీసుకెళ్లెందుకు బడ్జెట్ ఉపయోగపడుతుందన్నారు.
సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ఆధారిత బడ్జెట్ అని అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం ఉండేలా చూస్తామని అన్నారు. 2025 ఆగష్టు తరువాత 350 సంస్కరణలు తీసుకొచ్చామని,,ఆర్థిక ప్రణాళికలపై అంతర్జాతీయ పరిణామాల ప్రభావం ఉందని అన్నారు. ఆర్థిక సుస్థిరత కోసం ఆరు కీలక రంగాల్లో సంస్కరణలు తెచ్చామన్నారు. చాంపియన్ ఎంఎస్‌ఎంఈల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని,,రూ.10 వేల కోట్లతో రాబోయే ఐదేళ్లకు బయోఫార్మా శక్తి పథకం తీసుకొస్తున్నామని అన్నారు. ఫార్మా విద్య, పరిశోధనకు జాతీయ స్థాయిలో కొత్త విద్యాసంస్థలను తీసుకొస్తున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. చెప్పారు.
దేశంలో పలు వస్తువుల ధరలు తగ్గనున్నాయి అదే విధంగా మరికొన్ని వస్తువుల ధరలు పెరిగే అవకాశం..
మధుమేహం, క్యాన్సర్ చికిత్సలో వినియోగించే 17 ప్రాణరక్షక ఔషధాలు కొత్త కస్టమ్స్ డ్యూటీ సడలింపుతో వాటి ధరలు తగ్గుతాయి. బేసిక్ కస్టమ్స్ డ్యూటీ అంటే దిగుమతి వస్తువులపై విధించే ప్రాథమిక సుంకం.
తయారీ ప్రక్రియలో ఉపయోగించే భాగాలు, క్యాపిటల్ గూడ్స్‌పై ప్రభుత్వ సడలింపుల కారణంగా ధరలు తగ్గే సూచనలు ఉన్నాయి.
లిథియం-అయాన్ సెల్స్ పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు కారణంగా తగ్గుతాయి.
లెదర్, వస్త్ర రంగం: వెట్ బ్లూ లెదర్ వంటి ముడి పదార్థాలు, నిర్దిష్ట టెక్స్‌టైల్ ఇన్‌పుట్స్‌పై డ్యూటీ తగ్గింపు కారణంగా లెదర్ ఉత్పత్తులు, దుస్తుల ధరలు తగ్గుతాయి.
క్రీడా పరికరాలు: క్రీడల్లో పాల్గొనడాన్ని ప్రోత్సహించేందుకు క్రీడా వస్తువుల ధరలు మరింత తగ్గిస్తామని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.
ధరలు పెరిగేందుకు అవకాశం:- మేక్ ఇన్ ఇండియాకు ప్రోత్సాహం దృష్ట్యా దేశీయ తయారీదారుల కోసం కొన్ని వస్తువులపై మినహాయింపులు తొలగించారు. దాంతో ధరలు పెరుగుతాయి.
దేశీయ ఉత్పత్తి సరిపడా ఉన్న చోట్ల లేదా దిగుమతులు అతి తక్కువగా ఉన్న వస్తువులపై మినహాయింపులు తొలగించారు.
పారిశ్రామిక సరుకులపై కస్టమ్స్ టారిఫ్ రేట్లు సవరించడం వల్ల కొన్ని యంత్రాలు, భాగాల ధరలు పెరిగే అవకాశం ఉంది.
సిగరెట్లు, పాన్ మసాలా వంటి పొగాకు వస్తువులపై ఎక్సైజ్ డ్యూటీ, హెల్త్ సెస్ పెంపుతో ధరలు పెరిగే అవకాశం.
ఆదాయపు పన్ను చట్టం-2025:-
6 దశాబ్దల నిరీక్షణకు తెరదించుతూ 1961 ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త ‘ఆదాయపు పన్ను చట్టం-2025’ ను తీసుకొచ్చింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 బడ్జెట్‌లో దీనికి సంబంధించి కీలక మార్పులను ప్రకటించారు. ఈ కొత్త చట్టం ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి రానుంది. సామాన్యులకు సైతం అర్థమయ్యేలా, ట్యాక్స్ ఫైలింగ్‌ను సులభతరం చేసేలా దీనిని రూపొందించారు.

