జైలు నుంచి విడుదల అయిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
అమరావతి: జిల్లా జైలు నుంచి వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విడుదల అయ్యారు.మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ ఏపీ హైకోర్టు మంజూరు చేసింది. జైలు నుండి 226 రోజుల తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విడుదల అయ్యారు. జైలు నుంచి విడదల అనంతరం చెవిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయిన నాకు జైలు జీవితం తప్పదన్నారు.గతంలో చంద్రబాబు నాపై 72 కేసులు పెట్టాడని,, చంద్రగిరి నుంచి ఎదిగాను కాబట్టే చంద్రబాబు వేధిస్తున్నరన్నారు. మద్యం కేసులో గత సంవత్సరం జూన్ 17వ తేదిన చెవిరెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది.డిస్టిలరీలు,మద్యం సరఫరా కంపెనీల నుంచి కొల్లగొట్టిన డబ్బులో కొంత మొత్తాన్ని ప్రధాని నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డి నుంచి చెవిరెడ్డి అందుకున్నాడు.ఆ సోమ్మును గత అంసెబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్దులకు చేరవేసినట్లు సిట్ తన అభియోగాల్లో పేర్కొంది.

