వార్డు సచివాలయ ఉద్యోగుల శారీరక,మానసిక ఆరోగ్యం కోసం క్రీడా పోటీలు-కమీషనర్
నెల్లూరు: వార్డు సచివాలయ ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యం కోసం జె.ఏ.సి చేపట్టిన క్రీడా పోటీలు ఆదర్శంగా నిలుస్తాయని కమిషనర్ వై.ఓ నందన్ అన్నారు. స్థానిక ఏ.సి సుబ్బారెడ్డి క్రీడా మైదానంలో రెండు రోజులపాటు వార్డ్ సచివాలయ కార్యదర్శులకు “సింహపురి గ్రామ వార్డు సచివాలయ జాయింట్ యాక్షన్ కమిటీ” ఆధ్వర్యంలో పురుషులు, మహిళలకు వివిధ విభాగాలలో క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. బుధవారం నెల్లూరు నగరపాలక సంస్థ వార్షిక క్రీడోత్సవాలు-2026ను ఇన్ చార్జీ మేయర్ రూప్ కుమార్, కమిషనర్ వై.ఓ నందన్ లు ప్రారంభించారు. ఈ సందర్బంలో కమీషనర్ మాట్లాడుతూ జె.ఏ.సి ఆధ్వర్యంలో త్వరలో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలు కూడా నిర్వహించేలా కార్యాచరణ రూపొందించాలని జె.ఏ.సి నిర్వాహకులకు సూచించారు. ఇన్ చార్జీ మేయర్ రూప్ కుమార్ మాట్లాడుతూ వార్డు సచివాలయ కార్యదర్శులు విధుల నిర్వహణతో పాటు శారీరిక మానసిక ఆరోగ్యం పై దృష్టి సారించాలని, పోటీలలో క్రీడా స్ఫూర్తిని చాటాలని సూచించారు. అనంతరం జె.ఏ.సి నిర్వాహకులు మాట్లాడుతూ ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం నాడు నెల్లూరు నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో మంత్రివర్యులు డాక్టర్ పి.నారాయణ చేతులమీదుగా క్రీడా పోటీల విజేతలకు ప్రోత్సాహక బహుమతులను అందజేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మురహరి, నెల్లూరు నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ హిమబిందు, డిప్యూటీ డైరెక్టర్ మాధురి, టి.పి.ఆర్.ఓ వాసు బాబు, జె.ఏ.సి నిర్వాహకులు దారా సురేష్ బాబు, మురళి, భాను ప్రకాష్, వార్డు సచివాలయ అన్ని విభాగాల కార్యదర్శులు పాల్గొన్నారు.

