రైల్వే రిజర్వేషన్ చార్ట్ లు ఇక నుంచి 10 గంటలకు ముందే సిద్దం
అమరావతి: రైల్వే శాఖ రిజర్వేషన్ చార్ట్ లు ఇక నుంచి 10 గంటలకు ముందే విడుదల చేసేందుకు చర్యలు చేప్టటింది. ప్రస్తుతం రైలు బయలుదేరడానికి కేవలం 4 గంటల ముందు రిజర్వేషన్ చార్ట్ ను విడుదల చేస్తోంది. ఇక నుంచి రైలు బయలుదేరడానికి దాదాపు 10 గంటల ముందుగానే చార్ట్ ప్రిపేరు చేయాలని కీలక నిర్ణయం తీసుకుందని రైల్వేశాఖలోని ఓ అధికారి పేర్కొన్నారు.ఇందుకు సంబంధించిన చార్ట్ ప్రిపరేషన్ షెడ్యూల్‌ను రైల్వే బోర్డు అప్‌డేట్ చేసింది. దీంతో దాదాపు 10 గంటల ముందు టికెట్ స్టేటస్‌ను చెక్ చేసుకోవడం ద్వారా తమ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవడానికి వీలు కలుగుతుంది.అలాగే రిజర్వేషన్ వస్తుందా లేదా అనే ఆత్రుత తగ్గుతుంది. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బయలుదేరే రైళ్లకు తొలి చార్ట్ ను ముందు రోజు రాత్రి 8 గంటలకల్లా రూపొందిస్తోంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 12.00 గంటల వరకు అలాగే అర్థరాత్రి 12.00 గంటల నుంచి ఉదయం 5.00 గంటల వరకు బయల్దేరే రైళ్ల చార్ట్ లను కనీసం 10 గంటల ముందు రూపొందించాలని,, ఈ కొత్త షెడ్యూల్ ప్రకారం చర్యలు చేపట్టాలని ఇప్పటికే దేశంలోని అన్ని జోనల్ కార్యాలయాలకు రైల్వే బోర్డు లేఖ రాసింది.

