భారతీయ జనతా పార్టీ జాతీయ సారథిగా నితిన్ నబీన్ నియమకం
అమరావతి: భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బిహార్‌కు చెందిన నితిన్ నబీన్ నియమిస్తూ బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆదివారం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
బీజెపీ జాతీయ అధ్యక్షడుగా నియమితులైన నితిన్ నబిన్ కి పలువురు అగ్ర నేతలు శుభాకాంక్షలు తెలిపారు. బిహార్ లోని బాంకీపూర్ అసెంబ్లీ స్థానం నుంచి నితిన్ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి,,రహదారుల నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుత అధ్యక్షులు జేపీ నడ్డా స్థానంలో నబిన్ బాధ్యత స్వీకరించారు.

ప్రధాని మోదీ:- నితిన్ నబిన్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో మంచి అనుభవం ఉన్న నాయకుడు,,ఎమ్మెల్యే, బీహార్ మంత్రిగా ఆయన అద్భుతమైన పని తీరు కనబర్చారు. కష్టపడి పనిచేసే నాయకుడిగా నబిన్ గుర్తింపు పొందారని,,ఆయన పనితీరు రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తాయని నమ్ముతున్నా అంటూ ప్రధాని మోదీ ట్విట్ చేశారు.
హోం శాఖ మంత్రి అమిత్ షా:- బీజేపీ యువ మోర్చా జాతీయ(BJYM) ప్రధాన కార్యదర్శి, బీహార్ రాష్ట్ర యువ విభాగం ప్రెసిడెంట్‌గా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఇన్ చార్జిగా నితిన్ నబిన్ అంకిత భావంతో బాధ్యతలు నిర్వహించారు. పార్టీ కోసం రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడే ప్రతి యువ కార్యకర్తకు దక్కిన గౌరవం ఇది అంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు.
ఏపి బిజెపి అధ్యక్షడు:- యువకుడిగా, చురుకైన నాయకుడిగా, పార్టీ సిద్దాంతాలపై గట్టి విశ్వాసంతో అందరిచే గుర్తింపు పొందిన నేతగా నితిన్ నబిన్ జీకి గొప్ప గుర్తింపు ఉంది. ఆయనకు నా హృదయపూర్వక అభినందనలు అంటూ ఏపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ ట్విట్ చేశారు.

