గోవాలోని నైట్ క్లబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం-25 మంది మృతి
అమరావతి: ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలో ఉన్న బిర్చ్ బై రోమియో లేన్ అనే నైట్ క్లబ్‌లో అదివారం తెల్లవారు జామున వంట గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగాయి..ఈ ప్రమాదంలో 25 మంది మరణించారు.దాదాపు 50 మంది గాయపడ్డారు..ప్రమాదం సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది,,పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.. మృతుల్లో ముగ్గురు మహిళలు,,నలుగురు పర్యటకులు ఉన్నారని పోలీసులు తెలిపారు.. మిగిలిన వారంతా క్లబ్ సిబ్బందిగా గుర్తించారు.. సంఘటనా స్థలాన్ని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పరిశీలించారు.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ,, ప్రమాద సంఘటనపై లోతైన దర్యాప్తు చేస్తామని,,నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు..క్లబ్ నడిచేందుకు అనుమతిచ్చిన అధికారులపై సైతం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు..మృతుల్లో ముగ్గురు సజీవదహనం కాగా 20 మంది ఊపిరాడక మరణించారని,, క్లబ్‌లో భద్రతపరమైన నిబంధనలు పాటించలేదని ప్రాథమికంగా తెలుస్తున్నదని పేర్కొన్నారు..ప్రమాదం జరిగిన నైట్‌క్లబ్ రాజధాని పనాజీకి 25 కి.మీ దూరంలో ఉంటుంది.

