CRIMENATIONAL

బస్సులో ఘోర అగ్ని ప్రమాదం-15 మంది మృతి

అమరావతి: రాజస్థాన్‌ లోని జైసల్మేర్‌ నేషనల్ హైవేపై మంగళవారంనాడు ఉదయం 11.30 గంటలరే ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తైయాట్ ప్రాంతంలోని మిలటరీ స్టేషన్ సమీపంలో హైవేపై వెళ్లుతున్న ప్రైవేటు ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగడంతో 9 మంది సజీవదహనం కాగా 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.. మరో 25 మందికి స్వల్పగాయాలు అయ్యియి. బస్సులో నుంచి దట్టమైన పొగలు రావడంతో డ్రైవరు వెంటనే బస్సులు నిలిపివేశారు. నేషనల్ హైవేపై బస్సు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకోవడంతో కిలోమీటర్ల వరకూ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సమీపంలోని అర్మీ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శకటాలు రంగంలోకి దిగి చుట్టుపక్కలకు మంటలు విస్తరించకుండా వెంటనే అదుపులోనికి తెచ్చాయి. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోయింది. అయితే అగ్నిప్రమాదానికి కారణాలు తెలియరాలేదని కలెక్టర్ ప్రతాప్ సింగ్ తెలారు. ఏమిటనేది వెంటనే తెలియలేదు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *