నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఇక నుంచి నాలుగు జోన్లు-కమీషనర్
జోనల్ ఆఫీసర్లు..
నెల్లూరు: నగరపాలక సంస్థ పరిపాలన సౌలభ్యం దృష్ట్యా క్షేత్రస్థాయిలో నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆదేశలతో నెల్లూరు సిటీ నియోజకవర్గాన్ని నాలుగు జోన్లుగా విభజించినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ తెలిపారు. బుధవారం కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జోనల్ ఆఫీసర్స్, అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.
జోనల్ ఆఫీసర్లు:-
జోన్ 1. షేక్.రేష్మ, అసిస్టెంట్ కమిషనర్, 3,4,5,6,7,8,9 వార్డులు
జోన్ 2.కె. హిమబిందు, అదనపు కమిషనర్, 10.11, 13,14,15,16,45 వార్డులు
జోన్ 3.ఎన్. వాసు బాబు, టి.పి.ఆర్.ఓ-39,40,41,42,43,44,47
జోన్ 4. డి. భాను ప్రతాప్, 48,49,50,51,52,53,54డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లను జోనల్ ఆఫీసర్లు నియమించారు.
రానున్న రోజుల్లో నగరంలో అభివృద్ధి పనులతో పాటు మెగా వాటర్ కనెక్షన్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎండ్ టు ఎండ్ రోడ్ పనులు పూర్తిస్థాయి పర్యవేక్షణలో అనుకున్న సమయంలోపు పూర్తి చేయాలని సూచించారు. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, శానిటేషన్ విభాగం, జోనల్ ఆఫీసర్లతో కలసి వారి పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో పని చేయాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. నెల్లూరు నగరం గార్బేజి ఫ్రీ సిటీగా ఉండునట్లు డోర్ టు డోర్ చెత్త సేకరణ 100% పూర్తిగా జరగాలని ప్రతిరోజు జోనల్ ఆఫీసర్లు అందరూ పర్యవేక్షించాలని కమిషనర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు అదనపు కమిషనర్ హిమబిందు, డిప్యూటీ డైరెక్టర్ మాధురి, ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ. రహంతు జానీ, టి. పి. ఆర్. ఓ. వాసు బాబు, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ దినేష్, మలేరియా విభాగం డాక్టర్ జిజియా, టౌన్ ప్లానింగ్ విభాగం సిటీ ప్లానర్ రఘునాధరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు అనిల్ కుమార్, చంద్రయ్య, అడిషనల్ డైరెక్టర్ హార్టికల్చర్ నరసింహారావు, శానిటరీ సూపర్వైజర్లు, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, అమినిటీస్ వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

