ఇరాన్ లోని విద్యుత్ ప్లాంట్లు, బ్రిడ్జ్ ల చుట్టు యువత మానవ హారం
అమెరికా దాడులు చేస్తుందా?
అమరావతి: హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు సమీపిస్తున్న నేపధ్యంలో.. ఇరాన్ అప్రమత్తమైంది.ఇరాన్ లోని విద్యుత్ ప్లాంట్లు, బ్రిడ్జ్ లపై భీకరదాడులు చేస్తామని ట్రంప్ ఇప్పటికే హెచ్చరికలు చేసిన విషయం విదితమే. దింతో ఇరాన్.. కీలక విద్యుత్ కేంద్రాల చుట్టూ క్రీడాకారులు, కళాకారులు, విద్యార్థులతో సహా యువత మానవహారాలు ఏర్పాటుచేయాలని పిలుపునిచ్చినట్టు తెలుస్తొంది. దీంతో యువత పెద్దఎత్తున స్పందిస్తూ వాటి వద్దకు చేరుకుంటున్నారు.?
ఇరాన్ యువజన వ్యవహారాల ఉప మంత్రి అలిరెజా రహీమీ మాట్లాడుతూ ఈ ఆలోచన యువత నుంచే వచ్చిందని వెల్లడించారు. కొందరు విశ్వవిద్యాలయాల విద్యార్థులు, యువ కళాకారులు, యువజన సంస్థలు దేశంలోని విద్యుత్ కేంద్రాల చుట్టూ మానవ వలయంలా ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించారు’ అని రహీమీ చెప్పారు. యువత తీసుకున్న ఈ నిర్ణయం.. దేశ మౌలిక వసతులను రక్షించడంతో సహా యువత నిబద్ధతకు, వారి భవిష్యత్తు నిర్మాణానికి సంకేతంగా నిలుస్తుందని ఆశిస్తున్నామన్నారు.
డొనాల్డ్ ట్రంప్… హోర్ముజ్ జలసంధిని తెరిచేందుకు మంగళవారం రాత్రి (స్థానిక కాలమానం ప్రకారం బుధవారం వేకువజామున3:30 గంటలకు) వరకు గడువు విధించారు. అమెరికా ప్రతిపాదించిన ఒప్పందానికి ఇరాన్ అంగీకరించకపోతే కఠినమైన సైనిక చర్యలు తీసుకుంటామని, మౌలిక వసతులపై దాడులు కొనసాగిస్తామని హెచ్చరించారు. గడవు ముగిసిన తరువాత ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు దాడులను తీవ్రతరం చేసే అవకాశముంది. అయితే ఇదే సమయంలో,ఇరాన్ పై ఇలాంటి దాడులకు పాల్పపడితే,,ప్రతి దాడులుగా ఇరాన్ గల్ఫ దేశాలపై విరుచుకుని పడే అవకాశం వుంది. ఈ పరిస్థితిని తప్పించుకోవాలంటే..అమెరికా..ఇరాన్ తో చర్యలు ఫలప్రదంగా జరుగుతున్నాయని,,అందుకే కొంత కాలం దాడులను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి ఆశ్చర్యం లేదు.?

