NATIONAL

స్వాతంత్రం వచ్చిన తరువాత ఇది 8వ జనాభా లెక్కల సేకరణ-కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

ప్రధాని మోదీ అధ్యక్షతన కీలక నిర్ణయాలు..

అమరాతి: కేంద్ర కేబినెట్ 2027 జనాభా లెక్కల నిర్వహణ కోసం ​రూ.11,718 కోట్ల బడ్జెట్​ను ఆమోదించిందని కేంద్ర రైల్వేలు & సమాచార-ప్రసారం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్​ తెలిపారు. శుక్రవారం ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.2026-27ల్లో దేశవ్యాప్తంగా 2 దశల్లో జనగణన జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.భారతదేశంలో 150 ఏళ్లకు పైగా జనాభా లెక్కల సేకరణ జరుగుతోంది. అందుకు సంబంధించిన రికార్డులు అన్నీ మన వద్ద ఉన్నాయని తెలిపారు. స్వతంత్ర్యం వచ్చిన తరువాత ఇది 8వ సేకరణ అవుతుంది. కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. మంత్రివర్గంలో తీసుకున్న అంశాలను వివరించారు.

కీలక నిర్ణయాలు:- 1. 2027లో రెండు విడతల్లో జరగనున్న జనగణన కోసం రూ.11,718 కోట్ల బడ్జెట్‌ను కేబినెట్ ఆమోదించింది.ఈ జనగణనను డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి నిర్వహించనున్నారు.

  1. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు ‘పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజన’గా మారుస్తూ నిర్ణయం
  2. ఈ పథకం కింద ఒక కుటుంబానికి ఏడాదికి ఉన్న గరిష్ఠ పని దినాలను 100 నుంచి 120 రోజులకు పెంచింది. రోజు కూలీని రూ.240గా నిర్ణయించింది. రూ.1.51 లక్షల కోట్లు కేటాయింపు.
  3. బొగ్గు గనుల్లో పలు సంస్కరణలు తీసుకురావడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
  4. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన.. ఈ పథకం కింద అందించే మొత్తాన్ని రూ.6,000 నుంచి రూ.10,000 వరకు పెంచాలని నిర్ణయం తీసుకుంది.
  5. దేశవ్యాప్తంగా 57 కొత్త కేంద్రీయ విద్యాలయాల(Kendriya Vidyalayas) ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో తెలంగాణకు 4, ఆంధ్రప్రదేశ్ కి 4 మంజూరు చేసింది.
  6. నాలుగు కీలకమైన రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం
  7. సహకార రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి NCDC కింద రూ.2,000 కోట్ల ఆర్థిక సహాయం
  8. పీఎం కిసాన్ సంపద యోజన.. ఈ పథకానికి రూ.6,520 కోట్లు కేటాయింపు.
  9. క్వాంటం టెక్నాలజీ పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించడానికి అదనంగా రూ.4,000 కోట్ల నిధులు కేటాయింపు
  10. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (MSME)లకు బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు లభించేందుకు వీలుగా రూ.15,000 కోట్లతో కొత్త క్రెడిట్ గ్యారెంటీ పథకానికి గ్రీన్ సిగ్నల్
  11. దేశంలోని డిజిటల్ మౌలిక సదుపాయాలను రక్షించడనాకి సైబర్ దాడులను నిరోధించడానికి సైబర్ సెక్యూరిటీ పాలసీకి ఆమోదం.
  12. సెమీకండక్టర్ తయారీని ప్రోత్సహించేందుకు రూ.12,000 కోట్లు కేటాయింపు. కొత్త సెమీకండక్టర్ తయారీ కర్మాగారాలను నెలకొల్పే సంస్థలకు ఆర్థిక సహాయం పెంపు.
  13. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద అదనంగా 1.5 కోట్ల గృహాలను నిర్మించడానికి ఆమోదం
  14. చిన్న ఉపగ్రహాలను ప్రయోగించడానికి వీలుగా తమిళనాడులోని కులశేఖరపట్నం వద్ద కొత్త ప్రయోగ వేదిక (Launch Pad) నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
  15. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని రక్షణ రంగంలో బలోపేతం చేయడానికి, రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(FDI) పరిమితి పెంపు
  16. దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం వైద్య సేవలను అందించడానికి నేషనల్ టెలి-మెడిసిన్ నెట్‌వర్క్‌ ఏర్పాటుకు ఆమోదం
  17. నీటిపారుదల పథకాలకు జాతీయ మిషన్ ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 50 ప్రధాన, మధ్యస్థ నీటిపారుదల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి రూ.35,000 కోట్లతో ఒక కొత్త జాతీయ మిషన్‌ను ప్రారంభించేందుకు కేబినెట్ లైన్ క్లియర్ చేసింది.
  18. భారత్ నెట్ ప్రాజెక్ట్ కింద ఇంటర్నెట్ సేవలు. ఇందుకోసం అదనంగా రూ.8,000 కోట్ల నిధులు కేటాయింపు
  19. రాష్ట్రాల ఆర్థిక బలోపేతం కోసం ప్రత్యేక ప్యాకేజీ. ఇందులో భాగంగా రాష్ట్రాలు తమ మూలధన పెంచుకోవడానికి.. వడ్డీ లేని రుణాల రూపంలో రూ.1.3లక్షల కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందన్నారు.
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *