ఆస్ట్రేలియా,సిడ్నీనగరంలోని బాండి బీచ్ వద్ద కాల్పులు-11 మంది మృతి?
పాకిస్తాన్‌కు చెందిన నవీద్ అక్రమ్‌గా..?
అమరావతి: ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఉన్న ప్రఖ్యాత బాండి బీచ్ వద్ద ఆదివారం మధ్యహ్నం సమయంలో కాల్పులు సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందినట్లు సమాచారం అందుతొంది. పోలీసులు వెంటనే స్పందించి ఇద్దరు అగంతకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.దాదాపు 50 రౌండ్ల కాల్పుల జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు మీడియాకు తెలిపారు. సంఘటన అనంతరం న్యూ సౌత్ వెల్స్ పోలీసులు బీచ్ ప్రాంతాన్నితమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతానికి వెళ్లాల్సిందిగా సూచించినట్లు వార్త సంస్థలు పేర్కొన్నాయి.

మృతుల సంఖ్య మరింత పెరిగే:-మృతుల సంఖ్య మరింత పెరిగే:- బాండి బీచ్ లో హనుక్కా ఉత్సవం(యూదుల మతపరమైన) సందర్భంగా ఈ దారుణ సంఘటన జరిగినట్లు తెలుస్తుంది.బీచ్ వద్ద జరిగిన కాల్పుల్లో మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత రాలేదని,, ప్రస్తుతం 11 మంది మృతి చెందినట్లుగా గుర్తించామని సౌత్ వెల్స్ పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. సంఘటనా స్థలంలో రెస్క్యూ టీమ్ తో పాటు పెద్ద ఎత్తున అంబులెన్స్, మెడికల్ సిబ్బంది గాయపడిన వారికి చికిత్సలు అందిస్తున్నాయి. ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని బోండి బీచ్‌లో జరిగిన భయంకరమైన దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులలో ఒకరిని పాకిస్తాన్‌కు చెందిన నవీద్ అక్రమ్‌గా గుర్తించారు. దాడికి పాల్పడిన దుండగుల నుంచి మరింత సమాచారం రాబడుతున్నామని పోలీసులు తెలిపారు.

