బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబీన్ సిన్హా
అమరావతి: బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నితిన్ నబీన్ సిన్హా బాధ్యతలు స్వీకరించారు. దిల్లీలోని బీజెపీ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. మధ్యాహ్నం పట్నా నుంచి దిల్లీ చేరుకున్న నితిన్ నబీకి దిల్లీ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్వాగతం పలికారు. అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న నితిన్ నబీ, డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ,, పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ విగ్రహాల వద్ద పుష్పాలు ఉంచి నివాళులర్పించారు. తరువాత నితిన్ నబీని కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అమిత్ షా స్వయంగా తీసుకుని వెళ్లి కుర్చీలో కూర్చొబెట్టారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం పుష్పాలు అందించి అభినందనలు తెలిపారు.

