NATIONALPOLITICS

బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ త్వరలోనే సీ.ఎం పదవీకి రాజీనామా

రాజ్యసభకు నామినేషన్…

అమరావతి: జెడీయు అధ్యక్షుడు, బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్(75) రాజ్యసభకు వెళ్లనున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వానికి తన పూర్తి సహకారాన్ని అందిస్తానని తెలిపారు. నీతీశ్ చేసిన ఈ ప్రకటనతో, ఆయన సీఎం పదవి నుంచి వైదొలగనున్నట్లు స్పష్టత ఇచ్చారు.2005 నుంచి బిహార్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న నీతీశ్, త్వరలోనే రాజ్యసభలో ప్రవేశించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ‘ఎక్స్‌’ వేదికగా ధ్రువీకరించారు. దీంతో ఆయన త్వరలోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. రెండు దశాబ్దాలుగా మీరు నన్ను నమ్మి ఎంతో మద్దతిచ్చారు. అంకితభావంతో నా నేను విధుల్ని నిర్వర్తించాను. మీ మద్దతు, నమ్మకం వల్లే బిహార్ అభివృద్ధిలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది. నా పార్లమెంటరీ జీవితం ప్రారంభించినప్పటి నుంచి నా మనసులో ఓ కోరిక ఉంది. రాష్ట్ర స్థాయిలో రెండు చట్టసభలతో పాటు పార్లమెంట్‌లోని ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించాలనుకున్నాను. అందుకే త్వరలో జరగనున్న ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడిగా నా ప్రయాణాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నాను. నూతన బాధ్యతలు చేపట్టాక కూడా బిహార్‌తో నా బంధం ఇలాగే కొనసాగుతుందని హామీ ఇస్తున్నాను. కొత్త ప్రభుత్వానికి నా పూర్తి మద్దతు అందిస్తాను’ అని పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *