మంత్రి సత్యకుమార్ 14, 15 తేదీల్లో జిల్లాలో పర్యటన-కలెక్టర్
నెల్లూరు: రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈనెల 14, 15 తేదీల్లో నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం రాత్రి 8.00 గంటలకు తిరుపతి నుండి కారులో బయలుదేరి రాత్రి 10.00 గంటలకు నెల్లూరుకు చేరుకుని రాత్రి బస చేస్తారని తెలిపారు.15 వ తేది (సోమవారం) ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు నెల్లూరు నగరంలోని హరినాథపురం, ముత్తుకూరు రోడ్ జంక్షన్ వద్ద నిర్వహించే “అటల్ మోడీ సుపరిపాలన యాత్ర” కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం మధ్యాహ్నం 2.00 గంటలకు నెల్లూరు నుండి కారులో బయలుదేరి సాయంత్రం 4.00 గంటలకు ఒంగోలుకు చేరుకుంటారని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

