బస్సు ప్రమాదంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి
రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మరణించారు. తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కూతుళ్లు నందిని (డిగ్రీ ఫస్టియర్), సాయిప్రియ (డిగ్రీ థర్డ్ ఇయర్), తనూష (ఎంబీఏ) హైదరాబాద్లో చదువుతున్నారు. ఇటీవల బంధువుల పెళ్లి ఉండటంతో సొంతూరుకు వచ్చారు. ఈ తెల్లవారుజామున తిరిగి హైదరాబాద్ కు వెళ్తుండగా, బస్సు ప్రమాదంలో మరణించారు.

