ఏ రోజైనా భూసర్వే గురించి కనీసం ఆలోచించావా?-జగన్ సూటి ప్రశ్న
రీ సర్వేను 2018లోనే ప్రారంభించిన టీడీపీ ప్రభుత్వం-మంత్రి అనగాని
అమరావతి: రాష్ట్రంలో భూముల సర్వేపై అధికారపార్టీ,వైసీపీ పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటు, మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి,ఆరోపణలు,ప్రత్యఆరోపణలతో విరుచుకుని పడుతున్నారు.టీడీపీపైన వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తే,,అందుకు ధీటుగా టీడీపీ,,వైసీపీని కందికంపను దులిపినట్లు దులిపి వేస్తొంది.గురువారం మీడియా సమావేశాలు….
మాజీ ముఖ్యమంత్రి, జగన్:- వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి, జగన్ మాట్లాడుతూ రీసర్వే వాస్తవాలు. దానిపై చంద్రబాబు కూటమి దుష్ప్రచారం, రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆరోపించారు.క్రెడిట్ చోరీలో చంద్రబాబును మించిన వారు లేరు.ఉసరవెల్లి కూడా ఆయన్ను చూసి సిగ్గుపడుతుంది. చంద్రబాబు, ఎల్లో మీడియా దారుణ వ్యవహారం. చంద్రబాబూ, నిజాలు ఎంతో కాలం దాచలేవు అంటూ జగన్ మండిపడ్డారు. పూర్తిగా దిగజారిన శాంతి భద్రతలు. దానికి పరాకాష్ట దళిత కార్యకర్త మంద సాల్మన్ హత్య. ఇది ప్రజాస్వామ్య రాజ్యమా? లేక ఆటవిక పాలనా?. లేకపోతే నేటి విత్తనం రేపు వృక్షమవుతుందని హెచ్చరించారు.
రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్-స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్:- రీ సర్వేను 2018లోనే టీడీపీ ప్రభుత్వం ప్రారంభించింది.జగన్ రెడ్డిది క్రిమినల్ క్రెడిట్ చోరీ ప్రయత్నం. ప్రజల ఆస్తులను భక్షించిన జగనన్న భూరక్ష పథకం. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తో 22ఎను దుర్వినియోగం చేశారు.చంద్రబాబు కాలి గోటికి కూడా జగన్ రెడ్డి సరిపోడు.
అబద్దాలను అలవాటుగా చేసుకున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి భూములు, రీ సర్వేపై అసత్యపు విషం కక్కారని తెలిపారు. రీ సర్వేను 2018లోనే జగ్గయ్య పేట మండలం తక్కెళ్లపాడు గ్రామంలో టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. అప్పుడే రీ సర్వేను అత్యాధునిక టెక్నాలజీతో చేసేందుకు ఆర్వోఆర్ చట్టంలో మార్పులు తీసుకువస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పారు. కానీ జగన్ రెడ్డి మాత్రం తానే రీ సర్వేను కనిపెట్టినట్లు క్రిమినల్ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు గురించి మాట్లాడే కనీస అర్హత జగన్ కు లేదన్నారు. చంద్రబాబు కాలిగోటి కూడా జగన్ సరిపోడన్నారు. వైసీపీ ప్రభుత్వం రీ సర్వేను పూర్తిగా తప్పుల తడకగా నిర్వహించిందని, అందుకే ప్రజలు రీ సర్వే పై తమ ప్రభుత్వానికి 2.7 లక్షల ఫిర్యాదులు చేశారని చెప్పారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను అడ్డం పెట్టుకొని ప్రజల భూములను భక్షించేందుకు వీలుగా రీ సర్వేను నీరు కార్చారన్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ-వైసీపీ వాదనల్లో ఏది నిజం అనేది ప్రజలే బేరిజు వేసుకోవాలి…వీరి మీడియా యుద్దం సశేషం……..

